Wednesday Bank Holiday 2025: అక్టోబర్ నెలలో బ్యాంకులకు మొత్తం సెలవులే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఫెస్టివల్స్, నేషనల్ హాలీడేస్ కారణంగా.. దాదాపు ఈ నెల మొత్తం బ్యాంకులకు సెలవులే ఉన్నాయి. అందుకే కస్టమర్లు తమ బ్యాంక్ ఏయే రోజుల్లో ఓపెన్ ఉంటుందో తెలుసుకొని.. ముందుగానే ప్లానింగ్ చేసుకోవడం మంచిది. అయితే రేపు అనగా అక్టోబర్ 22న బుధవారం బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.
1/5అక్టోబర్ నెల అంతా పండుగలు, జాతీయ సెలవుల వల్ల బ్యాంకులన్నీ క్లోజ్‌గానే ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు అనేవి అక్కడ జరుపుకునే ఫెస్టివల్స్‌పై ఆధారపడి ఉంటాయి. అయితే రేపు కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
2/5అయితే అక్టోబర్ 22, బుధవారం రోజున.. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌లో బ్యాంకులకు హాలిడే ఉంది.
3/5బలిపాడ్యమి, లక్ష్మీ పూజ, విక్రమ్ సంవత్ నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా.. ఈ రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
4/5అయితే బ్యాంకులకు సెలవు ఉన్నప్పుడు కంగారు పడాల్సిన పనిలేదు. బ్యాంకులకు హాలీడేస్ ఉన్న కూడా వినియోగదారులు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్, బిల్లు పేమెంట్స్ చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎంలు, మొబైల్ యాప్‌లు, యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లను కూడా ఉపయోగించవచ్చు.
5/5అయితే, పెద్ద మొత్తంలో క్యాష్ డిపాజిట్లు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, అకౌంట్ సెటిల్‌మెంట్లు వంటి సర్వీసులు అందుబాటులో ఉండవు. బ్యాంక్ క్లోజింగ్ చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్.