Add Zee Business As A Preferred Source
App

Gold Rate: బ్యాంకు vs ప్రైవేట్ ఫైనాన్స్.. బంగారం తాకట్టు పెట్టాలంటే రెండింటిలో ఏది బెటర్..?

Written ByBhoomiUpdated byBhoomi
Published: Sep 16, 2025, 09:03 PM IST|Updated: Sep 16, 2025, 09:03 PM IST


 Gold Rate:  బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది తమ అవసరాల కోసం బంగారం తాకట్టు పెట్టి లోన్  తీసుకునే ప్లాన్ చేస్తుంటారు. అయితే చాలామందిలో ఒక సందేహం కలుగుతుంది.  బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టడం మంచిదేనా? లేక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా లోన్స్  తీసుకోవడం లాభదాయకమా? ఈ రెండింటిలో  లాభనష్టాలను అర్థం చేసుకుంటే సరైన నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. 

RBI1/6

ముందుగా బ్యాంకుల  గురించి తెలుసుకుందాం.  బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియంత్రణలో ఉంటాయి. వల్ల బ్యాంకులపై ప్రజల్లో మంచి విశ్వాసం ఉంటుంది. బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టినప్పుడు భద్రత విషయమై ఎలాంటి సందేహం ఉండదు. 

Gold loan2/6

NBFCలు లేదా ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలతో పోలిస్తే బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. దీంతో రుణగ్రహీతలకు ఆర్థిక భారం తగ్గుతుంది. బ్యాంకులు బంగారం రుణాలపై మాత్రమే ఆధారపడకపోవడం వల్ల వడ్డీ రేట్లలో స్థిరత్వం ఉంటుంది. 

Bank gold loan3/6

 ఒక లోపం ఏమిటంటే, బ్యాంకుల్లో లోన్ ప్రాసెస్ కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. అప్లికేషన్, వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్ వంటి ప్రక్రియలు కొంత కఠినంగా ఉండడం వల్ల తక్షణ అవసరాల కోసం రుణం తీసుకోవడం కొంత కష్టంగా మారుతుంది.

Private finance gold loan4/6

ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు లేదా NBFCలు మాత్రం రుణ ప్రక్రియను చాలా వేగంగా పూర్తిచేస్తాయి. కేవలం ఆధార్, పాన్ వంటి కేవైసీ డాక్యుమెంట్లు సమర్పిస్తే సరిపోతుంది. కొన్ని గంటల్లోనే లోన్ ప్రాసెస్ పూర్తై డబ్బు చేతికి వస్తుంది. 

NBFC gold loan5/6

అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాల్సిన వారికి NBFCలు ఎక్కువ ఉపయోగపడతాయి. అయితే వీటిలో వడ్డీ రేట్లు బ్యాంకులతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. దీని వలన రుణగ్రహీతకు తిరిగి చెల్లించాల్సిన మొత్తం భారంగా మారుతుంది. అంతేకాకుండా NBFCలు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండకపోవడం వల్ల కొంత రిస్క్‌గా భావించవచ్చు.

Gold loan interest rates6/6

మొత్తంగా.. భద్రత, తక్కువ వడ్డీ, విశ్వసనీయత కావాలనుకుంటే బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టడం ఉత్తమం. కానీ తక్షణం డబ్బు అవసరం ఉన్నప్పుడు, డాక్యుమెంటేషన్ కోసం ఎక్కువ సమయం కేటాయించలేనప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు మంచి ఆప్షన్‌గా మారుతాయి. కాబట్టి ఎవరికీ ఏ అవసరం ఉందో దాని ప్రకారం నిర్ణయం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.