Banks Remain Closed For 4 Days In This Week From October 20th To 23rd: అక్టోబర్ మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చాం. మరి ఈ వారంలో జరుగుతున్న పరిణామాలు ముందే తెలుసుకుంటే మంచిది. ముఖ్యంగా సెలవుల విషయం తెలుసుకోవాలి. బ్యాంకులు ఏ రోజు.. ఎప్పుడు పని చేస్తాయో తెలుసుకుందాం. అక్టోబర్ మూడో వారంలో బ్యాంకుల సెలవులు ఇలా ఉన్నాయి.
1/6వరుసగా పండుగలు రావడంతో అక్టోబర్ నెలను పండుగల మాసంగా చెప్పవచ్చు. మూడో వారంలో కూడా పండుగలు భారీగా రావడంతో బ్యాంకులకు భారీ సెలవులు వచ్చాయి. అక్టోబర్ మూడో వారంలో ఏకంగా నాలుగు సెలవులు వచ్చాయి. ఈ సెలవులను బ్యాంకు వినియోగదారులు ముందే తెలుసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
2/6ఈ వారం మొదటి రోజు అంటే సోమవారం (అక్టోబర్ 20) సెలవు వచ్చేసింది. అతి పెద్ద పండుగ దీపావళి, నరక చతుర్దశి కావడంతో దాదాపుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, త్రిపుర, మిజోరం, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, యుపి, న్యూఢిల్లీ, గోవా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, కేరళలో బ్యాంకులకు సెలవు వచ్చింది.
3/6దీపావళి పండుగ తర్వాత కూడా కొన్ని రాష్ట్రాల్లో సెలవు ఉంది. అంటే అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లలో బ్యాంకులకు సెలవు ఇచ్చారు. దీపావళి సందర్భంగా రెండో రోజు కూడా సెలవు ఉంది.
4/6దీపావళి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అక్టోబర్ 22వ తేదీ బుధవారం కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. బలి ప్రతిపాద, విక్రమ్ సంవంత్ కొత్త సంవత్సరం, గోవర్ధన్ పూజ, బలిపాడ్యమి, లక్ష్మీ పూజ వంటి ప్రత్యేక ఉత్సవాల నేపథ్యంలో బ్యాంకులకు సెలవు ఇచ్చారు. ఆ సెలవు గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, సిక్కిం, అస్సాం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంది.
5/6నాలుగో రోజు అంటే అక్టోబర్ 23 గురువారం కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. భాయ్ బిజ్, భైడూజ్, చిత్రగుప్త జయంతి, లక్ష్మీ పూజ, భ్రాత్రిద్వితీయ, నింగోల్ చక్కూబా తదితర ప్రత్యేక ఉత్సవాలు ఉండడంతో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. గుజరాత్, నాగాలాండ్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు వచ్చింది.
6/6అక్టోబర్ మూడో వారంలో రెండు దినాలు మాత్రమే పని రోజులు ఉన్నాయి. మిగిలిన నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో బ్యాంకు ఉద్యోగులు పండుగ చేసుకుంటుండగా.. వినియోగదారులు, ఖాతాదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.