Add Zee Business As A Preferred Source
App

Bathukamma: నేటి నుంచే పూల పండుగ బతుకమ్మ... ఏ రోజు ఏం వండాలి? ఎలా పూజించాలి?

Published: Sep 21, 2025, 08:36 AM IST|Updated: Sep 21, 2025, 08:36 AM IST

Bathukamma 2025 Special Flower Festival Starts From September 21st To 30th: ప్రపంచంలోనే పూలను పూజించే పండుగ ఒక్క తెలంగాణలోనే ఉంది. అంతటి విశిష్ట పండుగ ఆదివారం నుంచి ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు జరగనున్న బతుకమ్మలో ఏ రోజు ఏ ప్రత్యేకత, ఏ రోజు ఏం వండాలి? అనే వివరాలు తెలుసుకుందాం.

1/11

మహాలయ అమావాస్య రోజు మొదలై దుర్గాష్టమి వరకు చేసుకునే తొమ్మిది రోజుల మహోత్సవం బతుకమ్మ. ప్రకృతిని, స్త్రీతత్వాన్ని, శక్తిని, సమైక్యతను ఆరాధించే ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబరం. పువ్వులతో గోపురంగా అలంకరించిన పసుపు గౌరమ్మ రూపాన్ని మహిళలు పూజించి పాటలు పాడుతారు. బతుకమ్మలో వాడే పువ్వులు తంగేడు, బంతి, గునుగు, మందార, మల్లె వంటి పువ్వులు ఉంటాయి. ప్రతి పువ్వు ఒక శక్తిని, ఒక ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. ఔషధ గుణాలు కలిగిన ఈ పువ్వులు నీటిని శుద్ధి చేస్తాయి. బతుకమ్మ పండుగతో మహిళల మధ్య ఐక్యత పెరుగుతుంది.

2/11

ఎంగిలిపువ్వుల బతుకమ్మ: మొదటి రోజు ఎంగిలిపువ్వు బతుకమ్మ అంటారు. బతుకమ్మ ఆడిన తర్వాత నువ్వులు, బియ్యం పిండివంటలు చేసుకుని తింటారు. బతుకమ్మను గౌరీదేవి స్వరూపంగా ఆరాధిస్తారు. తొమ్మిది వరుసలు నవదుర్గలు, నవనిధులు, నవగ్రహాలు, నవరాత్రులు, నవావరణాలు అనే దానికి ప్రతీక. బతుకమ్మ పూజ శ్రీచక్రార్చనకు ప్రతిపదం అని భావిస్తారు.

3/11

అటుకుల బతుకమ్మ: రెండో రోజు అటుకుల బతుకమ్మ చేసుకుంటారు. ఈరోజు అటుకులు, బెల్లం, పప్పు నైవేద్యంగా తీసుకుంటారు. సతీదేవి త్యాగం, గౌరీదేవి కరుణ, దుర్గాదేవి శక్తి బతుకమ్మలో ప్రతిబింబిస్తాయి.

4/11

ముద్దపప్పు బతుకమ్మ: బతుకమ్మ ఆడిన తర్వాత ముద్దపప్పు, పాలు, బెల్లం తింటారు.

5/11

నానబియ్యం బతుకమ్మ: ఈరోజు నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం తీసుకుంటారు.

6/11

అట్ల బతుకమ్మ: ఐదో రోజు అట్ల బతుకమ్మ చేసుకుంటారు. ఈరోజు బియ్యం పిండితో అట్లు/దోసెలు చేసుకుంటారు.

7/11

అలిగిన బతుకమ్మ: ఈరోజు ఎలాంటి నైవేద్యం ఉండదు. అలక తొలగించే ఆరాధన కావడంతో నైవేద్యం లేకుండా బతుకమ్మ చేసుకుంటారు.

8/11

వేపకాయల బతుకమ్మ: ఏడో రోజు వేపకాయల బతుకమ్మ అంటారు. ఈరోజు వేపకాయ ఆకారంలో వంటలు చేసుకుంటారు.

9/11

వెన్నముద్దల బతుకమ్మ: 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు నువ్వులు, వెన్న, బెల్లం వంటలు తింటారు.

10/11

సద్దుల బతుకమ్మ: బతుకమ్మ ఉత్సవాల్లో ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ. ఈరోజు ఐదు రకాల అన్నాలు వండుకుని తింటారు. పెరుగన్నం, పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం స్వీకరిస్తారు. ఈ రోజుతో బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.

11/11

సద్దుల బతుకమ్మ: బతుకమ్మ ఉత్సవాల్లో ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ. ఈరోజు ఐదు రకాల అన్నాలు వండుకుని తింటారు. పెరుగన్నం, పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం స్వీకరిస్తారు. ఈ రోజుతో బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.