Add Zee Business As A Preferred Source
App

Batukamma: బతుకమ్మ వేడుకలు.. ఇందిరమ్మ చీరలు ఈసారైనా మహిళలకు అందేనా?

Written ByRenuka Godugu
Published: Sep 02, 2025, 10:33 AM IST|Updated: Sep 02, 2025, 10:33 AM IST

Batukamma Saree Distribution Update: ఈ ఏడాది బతుకమ్మ వేడుకలు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి ఈ ఏడాది వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. అయితే ఈసారైనా బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరలు అందుతాయా? లేదా? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
 

Tankbund Carnival1/5

ట్యాంక్ బండ్ కార్నివాల్

 బతుకమ్మ వేడుకల సందర్భంగా ప్రముఖ ఆలయాలు, పర్యటక ప్రదేశాల్లో కూడా వేడుకలు జరిపిస్తున్నామని జూపల్లి తెలిపారు. ప్రధానంగా 27వ తేదీ ట్యాంక్ బండ్ పై కార్నివాల్ నిర్వహించనున్నారు. 28న స్టేడియంలో గిన్నిస్ రికార్డే లక్ష్యంగా 10,000 మందితో సంబరాలు ఉంటాయన్నారు.  

Minister Jupalli2/5

మంత్రి జూపల్లి

 ఇక 29న పీపుల్స్ ప్లాజా వద్ద బతుకమ్మ పోటీలు, 30న బతుకమ్మ పర్యాటక ప్రదేశాలల్లో కూడా నిర్వహిస్తామని మంత్రి జూపల్లి వెల్లడించారు. ఈ బతుకమ్మ వేడుకలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అధికారికంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం తెలంగాణ మహిళలకు చీరలు కూడా పంపిణీ చేసింది.  

Floating Batukamma3/5

ఫ్లోటింగ్ బతుకమ్మ

గత ఏడాది నుంచి మహిళలకు చీరలు దొరకడం లేదు. ఎన్నికల కోడ్ సందర్భంగా వారికి లభించలేదు. ఇక తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ వేడుకల నిర్ణయం పైగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది రోజులపాటు వైభవంగా నిర్వహించాలని హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో ఫ్లోటింగ్ బతుకమ్మ వేడుకల పేరుతో సరికొత్త కార్యక్రమం కూడా నిర్వహించనుంది.  

Batukamma festivals4/5

బతుకమ్మ వేడుకలు

ఈ బతుకమ్మ వేడుకల్లో భాగంగా ప్రముఖులు కూడా పాల్గొననున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. తెలంగాణ మహిళలకు ఈసారైనా ఇందిరమ్మ చీరలు దొరుకుతాయా అనే సందేహమే ఉంది. గతేడాది శారీలు ఇవ్వాలని సర్కారు మరింత క్వాలిటీతో మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు అందిస్తామని చెప్పింది.  

Batukamma5/5

బతుకమ్మ

 అయితే సెప్టెంబర్ 21 నుంచి 30 మధ్య బతుకమ్మ వేడుకలు నిర్వహించనుంది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. దీంతో ఎందుకు రెండు వారాల ముందు నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ పరిణామాలను బట్టి ఈసారి ఆడబిడ్డలకు చీరలు అందకపోవచ్చు.