Add Zee Business As A Preferred Source
App

Beetroot Chutney: రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే బీట్రూట్ పచ్చడి.. టిఫిన్ ఏదైనా సరే..!

Written ByVishnupriya
Published: Aug 27, 2025, 01:45 PM IST|Updated: Aug 27, 2025, 01:45 PM IST

Beetroot Pachadi 
రోజు టిఫిన్ లోకి పల్లీల చట్నీ..తినడం ద్వారా ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ పల్లి చట్నీకి.. చాలా దూరంగా ఉండటం మంచిది అని వైద్య నిపుణులు సైతం సలహాలు ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఇలాంటి చట్నీలు ట్రై చేయడం మంచిది 
 

Best Chutney For Heart Patients 1/5

పల్లీ చట్నీ కన్నా కూడా హార్ట్ పేషెంట్స్ కి..అలానే బరువు తగ్గాలి అనుకునే వారికి టిఫిన్స్ లోకి బీట్రూట్ పచ్చడి ఎంతో మేలు చేస్తుంది.  బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడే ఈ బీట్రూట్ పచ్చడి ఎలా చేసుకోవాలంటే..

Required Ingredients 2/5

కావలసిన పదార్థాలు 

ముక్కలుగా చేసిన బీట్రూట్ : 2  ఉద్దిపప్పు రెండు :టేబుల్ స్పూన్లు  ఎండు మిరపకాయలు: రెండు  చింతపండు కొద్దిగా  రుచికి సరిపడా ఉప్పు  తిరగమాత పదార్థాలు 

Preparation Method3/5

ఈ పచ్చడి చేయడం కోసం ముందుగా.. ఎండు  మిరపకాయలు, తరిగిన బీట్రూట్, ఉద్దిపప్పు, అన్నీ కలిపి వేయించుకోవాలి. 

Beetroot Chutney Preparation 4/5

ఇప్పుడు ఈ వేయించిన పదార్థాలు అన్నీ కూడా మిక్సీకి వేసి చట్నీ లాగా చేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. 

Beetroot Chutney Add On 5/5

ఇక మరో బాంధలిలో నూనె పోసి.. ఆవాలు, జీలకర్ర కరివేపాకు, వేసుకొని.. అవి చిటపటలాడాక ఈ చట్నీ ని అందులో వేయాలి. అంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ చట్నీ రెడీ..