Nagarjuna - Rajini:‘కూలీ’ కంటే ముందు రజినీ, నాగ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ మూవీ.. పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు..

Nagarjuna - Rajini Multistarrer Biggest Disaster: ప్రస్తుతం నాగార్జున, రజినీకాంత్ కలిసి లోకేష్ కనగరాజ్ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో ఇంప్రెసివ్ గా ఉంది. ఈ సినిమా కంటే వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన ప్యాన్ ఇండియా చిత్రం సోదిలో లేకుండా పోయింది. 

1 /5

Nagarjuna - Rajini Multistarrer Biggest Disaster: కూలీ కంటే ముందు రజినీకాంత్, నాగార్జున కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ వచ్చిందా అంటే వచ్చింది. లేదు లేదు అని చెప్పాలి. ప్రస్తుతం ఓ కథను పలు భాషల్లో మన స్టార్స్ తో తెరకెక్కించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు మేకర్స్. కానీ ఈ ఐడియా ఇప్పటిదే కాదు.. తెలుగు సినిమా ప్రారంభమైన స్వర్ణయుగం నుంచే ఉంది. 

2 /5

అప్పట్లో దాదాపు 34 యేళ్ల క్రితమే కన్నడ నట దర్శకుడు వి. రవిచంద్రన్ రజినీకాంత్, నాగార్జునలతో నాలుగు భాషల్లో  ‘శాంతి క్రాంతి’ అనే భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించారు. 

3 /5

ఈ సినిమాను తెలుగులో నాగార్జున, రవిచంద్రన్ నటిస్తే.. తమిళం, హిందీలో మాత్రం నాగార్జున ప్లేస్ లో రజినీకాంత్ నటించారు. కన్నడలో మాత్రం రవిచంద్రన్, రమేష్ అరవింద్ నటించారు.  ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. అన్ని భాషల్లో ఈ సినిమా డిజాస్టర్ రికార్డు నెలకొల్పింది. 

4 /5

తమిళంలో ఈ సినిమా టైటిల్ ‘నాట్టుక్కు ఒరు నల్లవాన్’. ఈ సినిమా తెలుగులో ఆ తర్వాత ‘పోలీస్ బుల్లెట్’ పేరుతో ప్రేక్షకుల మీదికి భాషా హిట్ తర్వాత రజినీకాంత్ నటించిన పాత డిజాస్టర్స్ మూవీస్ అన్నింటిని డబ్  చేసి తెలుగు ప్రేక్షకుల మీదికి ఒదిలారు. అలా తెలుగులో ‘పోలీస్ బుల్లెట్’ పేరుతో విడుదలైంది. ఫైనల్ గా  సోదిలో లేకుండా పోయింది. 

5 /5

‘శాంతి క్రాంతి’ చిత్రం 1991 సెప్టెంబర్ 19న కన్నడ, తెలుగు వెర్షన్స్ విడుదలయ్యాయి. అదే ఇయర్ రెండు వారాల తర్వాత అక్టోబర్ 2న తమిళ వెర్షన్ రిలీజైంది. ఈ సినిమా రవిచంద్రన్ దర్శకత్వంలో నాలుగు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కింది. ఒక రకంగా దక్షిణాది నుంచి నాలుగు భాషల్లో తెరకెక్కిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాలో జుహీచావ్లా, ఖుష్బూ హీరోయిన్స్ గా నటించారు.