Add Zee Business As A Preferred Source
App

BEL Recruitment 2025: నిరుద్యోగులకు బంపర్ ఛాన్స్.. బీఎస్సీ, బీటెక్ అర్హతతో BELలో ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసేయండి..!

Written ByAruna Maharaju
Published: Sep 26, 2025, 12:26 PM IST|Updated: Sep 26, 2025, 12:26 PM IST

Bel trainee engineer notification: మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే.. ఈ అద్భుత అవకాశం మీ కోసమే. బీఎస్సీ, బీటెక్ అర్హతతో BELలో ట్రైనీ ఇంజినీర్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసేయండి. దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 7 చివరి తేది. కాబట్టి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. 

Bel Trainee Engineer Recruitment 20251/5

ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, నవరత్న కంపెనీ అయిన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఇంజినీర్ –1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ లాస్ట్ డేట్ అక్టోబర్ 7 వరకు ఉంది. 

Bel Trainee Engineer Recruitment  2/5

Belలో ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగాలు

మొత్తం 610 పోస్టులు ఉన్నాయి.  ట్రైనీ ఇంజినీర్ 1– టీఈబీజీ 488, ట్రైనీ ఇంజినీర్ 1 – టీఈఈఎం 122. అర్హతలు ఇలా ఉన్నాయి. గుర్తించబడిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌లో నాలుగేళ్ల బీటెక్ లేదా బీఈ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.   

Bel Trainee Engineer Recruitment 20253/5

Belలో ట్రైనీ ఇంజినీర్ జాబ్స్

వయసు పరిమితి 28 సంవత్సరాలు మాత్రమే. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వర్గాలకు సడలింపు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అప్లికేషన్లు ఇప్పటికే సెప్టెంబర్ 24 నుంచి మొదలుకాగా.. అక్టోబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ. 177. 

Bel Trainee Engineer Recruitment 4/5

లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్

ఎంపిక ప్రక్రియలో మొదట షార్ట్‌లిస్టింగ్ చేసి ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 85 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో సాధారణ అప్టిట్యూడ్ మరియు టెక్నికల్ అంశాలపై దృష్టి పెట్టి ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు ఇస్తారు. తప్పు సమాధానాలకు 0.25 మార్కులు తగ్గిస్తారు.

Bel Trainee Engineer Recruitment 20255/5

జాబ్స్ నోటిఫికేషన్ 2025

ఎంపికైన వారికి నెలకు 30 వేల నుంచి 40 వేల రూపాయల వరకు జీతం ఇస్తారు. మరిన్ని వివరాలు మరియు దరఖాస్తు చేయడానికి బీఈఎల్ అధికారిక వెబ్‌సైట్ bel-india.in ని సందర్శించండి.