Best Budget Phones: మన దేశంలో ప్రస్తుతం 5G వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే అందరూ ఖరీదైన ఫోన్లు కొనుగోలు చేయలేరు. కొందరు బడ్జెట్‌లో ఫోన్ తీసుకుందామని ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా తక్కువ ధరలో 5G స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. మీకు గుడ్ న్యూస్. రూ.8 వేల కంటే తక్కువ ధరకే చాలా మంచి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు మీ కోసం..
1/5Samsung Galaxy M06 5G ఫోన్ ధర 7,999 రూపాయలుగా ఉంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 4GB RAM, 64GB స్టోరేజ్ కెపాసిటీ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ 5,000mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
2/5ఇంకాస్త తక్కువ ధరలో కావాలంటే Itel P55 5G కూడా ఉంది. ఈ ఫోన్ కేవలం రూ.7,799 ధరకు లభిస్తుంది. MediaTek Dimensity 6080 ప్రాసెసర్, 4GB RAM, 64GB స్టోరేజ్ ఉంది. డిస్ప్లే 6.6-అంగుళాల HD+ ప్యానెల్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
3/5Redmi A4 5G ఫోన్ ధర రూ.7,999. ఇది స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్‌తో ఉంది. 6.88-అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. 50 MP బ్యాక్, 5 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చే 5,160mAh బ్యాటరీని కలిగి ఉంది. పెద్ద స్క్రీన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
4/5బెస్ట్ కెమెరా ఫోన్ కావాలనుకుంటే లావా స్టార్మ్ లైట్ 5G ఫోన్ తీసుకోవచ్చు. ఈ ఫోన్ రూ.7,999 ధరకు లభిస్తుంది. MediaTek Dimensity 6400 ప్రాసెసర్ ఉండగా.. 4GB RAM, 64 GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. 6.75-అంగుళాల 120Hz డిస్‌ప్లే, అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు 50MP ప్రైమరీ కెమెరాను కూడా ఉంది. 5,000mAh బ్యాటరీతో గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం చాలా యూజ్ అవుతుంది.
5/5Poco C75 5G ఫోన్ రూ.7,699. స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్, 4GB RAM, 64 GB స్టోరేజ్‌తో వస్తుంది. 6.88 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 5,160mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.