Add Zee Business As A Preferred Source
App

Best Business Ideas: కుందేళ్ల పెంపకంతో కోట్లు సంపాదించవచ్చా? ఈ బిజినెస్ గురించి అసలు విషయం తెలుసుకుంటే.. షాక్ అవ్వడం పక్కా..!!

Written ByBhoomi
Published: Sep 17, 2025, 09:27 PM IST|Updated: Sep 17, 2025, 09:27 PM IST

Best Business Ideas:  ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కుందేళ్ల పెంపకంతో లక్షలు సంపాదించవచ్చు..కోట్లు సంపాదించవచ్చు.. అనే వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కానీ  నిజ జీవితంలో అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి.  సోషల్ మీడియాలో చెప్పినట్లుగా అంత సులభమేనా? నిజానికి రైతుల్లో ఎక్కువ మంది లాభాలు కాకుండా నష్టాలు చవిచూసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే కుందేళ్ల పెంపకం ఎంతవరకు వ్యాపారంగా సక్సెస్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

rabbit farming telugu1/6

కుందేళ్ల మాంసానికి డిమాండ్

మొదటగా చెప్పుకోవాల్సింది మార్కెట్ డిమాండ్. చికెన్, మటన్ లాంటి మాంసాలకు ఎంత డిమాండ్ ఉన్నదో కుందేళ్ల మాంసానికి డిమాండ్ అంతగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. భారత్ మొత్తంలో కూడా కుందేలు ప్రధాన మాంసాహారంగా తీసుకునే ప్రజలు చాలా తక్కువగా ఉంటారు. అంటే మార్కెట్ బలహీనంగా ఉంటుందని చెప్పవచ్చు. డిమాండ్ తక్కువగా ఉండటంతో పెద్ద ఎత్తున పెంపకం చేస్తే విక్రయాలు జరగక నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వ్యాపారస్తులు చెబుతున్నారు.

rabbit meat demand2/6

తక్కువ పెట్టుబడితో లాభం వచ్చే అవకాశం

కుందేళ్ల పెంపకం చిన్న స్థాయిలో చేస్తే తక్కువ పెట్టుబడితో లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే ఖర్చులు ఎక్కువ అవుతాయి. వీటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవి త్వరగా చనిపోతాయి. అలాగే రోగాలకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ వ్యాపారంలో రిస్క్ ఎక్కువ అని చెప్పవచ్చు.  

farmers side business3/6

ఆహార ఖర్చులు, మందుల ఖర్చులు

కుందేళ్లు వేగంగా పెరుగుతుంటాయి. సంతానోత్పత్తి కూడా వేగంగా ఉంటుంది. ఇది లాభంలా అనిపించినా, మార్కెట్ లేకపోతే ఆ పెంపకం మరింత భారమవుతుంది. అమ్మకం జరగకపోతే ఆహార ఖర్చులు, మందుల ఖర్చులు పెరిగి రైతు నష్టపోతాడు.

rabbit business profits and losses4/6

కోళ్లు, మేకలు, గొర్రెలతో పాటు సైడ్ బిజినెస్

చాలా మంది రైతులు కుందేళ్ల పెంపకాన్ని కోళ్లు, మేకలు, గొర్రెలతో పాటు సైడ్ బిజినెస్ గా పెంచితే కొంత అదనపు ఆదాయం వస్తుంది. కానీ కుందేళ్లపైనే పూర్తి బిజినెస్ మోడల్ పెట్టుకోవడం మాత్రం రిస్కీ అని చెప్పుకోవచ్చు.

rabbit farming profits5/6

కుందేళ్ల పెంపకం ద్వారా కోట్ల రూపాయలు

సోషల్ మీడియాలో చూపిస్తున్న విధంగా  కుందేళ్ల పెంపకం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించడం చాలా అరుదు అనే చెప్పాలి. వాస్తవానికి ఈ వ్యాపారం మార్కెట్ డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది. సరైన స్థాయిలో, అదనపు వనరుగా చేస్తే లాభం వచ్చే అవకాశం ఉంటుంది. 

rabbit farming in telugu6/6

నష్టపోయే అవకాశాలు ఎక్కువ

కానీ పెద్ద స్థాయిలో చేస్తే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుందేళ్ల పెంపకం చేయాలని ఆలోచించే రైతులు ముందుగా మార్కెట్ రీసెర్చ్ చేసి, చిన్న స్థాయి నుంచి ప్రారంభిస్తే మంచిది.