Five Star Safety Car Is Innova Hycross Know The Features And Price: కారు అంటే రాజసం ఉండాలని భావిస్తే టయోటా వాహనాలను వినియోగించవచ్చు. టయోటా కంపెనీ నుంచి వచ్చే వాహనాలు దర్జాతనం చూపిస్తాయి. ఆ కారులో వెళ్తుంటే రాజసంగా ఉంటుంది. అలాంటి కంపెనీ నుంచి వచ్చిన ఇన్నోవా హైక్రాస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హైక్రాస్ ప్రత్యేకతలు తెలుసుకుందాం.
హుందాతనం.. దర్జా.. రాజసం రావాలంటే టయోటా కార్లు వాడాలనే అభిప్రాయం ఉంటుంది. జపాన్‌కు చెందిన టయోటా కార్లు వినియోగదారులను అమితంగా ఆసక్తి కనబరుస్తున్నాయి. భారతదేశ రోడ్లకు తగ్గట్టు వస్తున్న టయోటా కార్లపై ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. ఆ కంపెనీ నుంచి వచ్చిన ఇన్నోవా హైక్రాస్ మోడల్ చూద్దాం. ధర, ఫీచర్లు అన్నీ పరిశీలిద్దాం.
జపాన్‌కు చెందిన టయోటా సంస్థ నుంచి కొత్త ఇన్నోవా హైక్రాస్ కారు అందుబాటులోకి వచ్చింది. అద్భుతమైన ఫీచర్లు, ఎక్కువ మైలైజ్, ధర కూడా సాధారణంగా ఉండడంతో ఈ కారు భారత వాహప్రియులను ఆకట్టుకుంటోంది. ఇన్నోవా హైక్రాస్ కారుకు డ్రైవ్ మోడ్ స్విచ్ ఉండటంతో డ్రైవర్లు పెట్రోల్-ఓన్లీ, హైబ్రిడ్ మోడ్‌ల మధ్య సులభంగా మారవచ్చు.
భారీ వాహనం అయినా కూడా మైలేజ్‌లో ఏమాత్రం తగ్గడం లేదు. 23 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని టయోటా చెబుతోంది. భద్రతా ప్రమాణాల్లో ఈ కారు ఫైవ్ స్టార్ రేటింగ్ పొందడం విశేషం. ఈ కారు భారతీయ కుటుంబాలకు ఎంతగానో అనుకూలంగా ఉంటుంది.
హైబ్రిడ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.25.90 లక్షల నుంచి ప్రారంభం. జీఎస్టీ ధర తగ్గింపుతో ఈ ప్రయోజనం వినియోగదారులకు టయోటా అందిస్తోంది.
ఇన్నోవా హైక్రాస్ ఫీచర్లు పరిశీలిస్తే వెంటిలేటెడ్ సీట్లు, లాంగ్-స్లైడ్ ఆటోమన్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.