Best Hair Fall Remedy: హెయిల్ ఫాల్ సమస్యకు బెస్ట్ నేచురల్ థెరపీ ఇదే, ఎలా రాయాలంటే

Best Hair Fall Remedy: ఇటీవలి కాలంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు లేదా జీవనశైలి లేదా కాలుష్యం కారణంగా హెయిర్ ఫాల్ అనేది ప్రధాన సమస్యగా మారింది. అదే పనిగా జుట్టు రాలుతుండటంతో కొన్ని రోజులకు తలంతా పల్చగా మారి బట్టతల కన్పిస్తుంటుంది. మార్కెట్‌లో లభించే కెమికల్ సహిత పదార్ధాలు కాకుండా కొన్ని సహజసిద్ధమైన చిట్కాలతో ఈ సమస్యను అద్భుతంగా తగ్గించవచ్చు. 

Best Hair Fall Remedy: ప్రకృతిలో విరివిగా లభించే అల్లోవెరా జెల్‌తో హెయిర్ ఫాల్ సమస్యను అద్భుతంగా నివారించవచ్చు. అయితే అల్లోవెరా ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /5

అల్లోవెరా జెల్ అల్లోవెరా జెల్ అనేది చర్మం సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే వివిధ రకాల పోషకాలు కేశాలకు కావల్సిన న్యూట్రియంట్స్‌ను అందిస్తాయి.

2 /5

ఎలా రాయాలి అల్లోవెరా జెల్ కేశాలకు రాయడం చాలా సులభం. అల్లోవెరా మొక్క పైభాగంలో ఉండే గ్రీన్ భాగాన్ని తొలగించాలి. ఇప్పుడు మధ్యలో ఉండే జెల్‌ను మిక్సీలో మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేశాలకు రాసి ఓ 20 నిమిషాలు ఉంచి స్నానం చేయాలి

3 /5

కీలకమైన సూచనలు అల్లోవెరా జెల్ రాసిన తరువాత దురద లేదా మంట లేదా ఎలర్డీ వంటిది సంభవిస్తే వెంటనే హెయిర్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరికి పడకపోవచ్చు. హెయిర్ ఫాల్ పరిమితి మించి ఉంటే వైద్యుని సంప్రదించాలి

4 /5

హెయిర్ ఫాల్ మీరు ఒకవేళ హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతుంటే అల్లోవెరా జెల్ వాడవచ్చు. అల్లోవెరా జెల్ వాడటం వల్ల హెయిర్ ఫాల్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. హెయిర్ ఫాల్ సమస్య తగ్గించేందుకు తాజా అల్లోవెరా జెల్ వినియోగిస్తే మంచిది

5 /5

ఈ ఆర్టికల్ ద్వారా ఇచ్చే సూచనలు, సలహాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని జీ న్యూస్ ధృవీకరించడం లేదు.