Easy Yoga Asanas For Weight Loss
ఈ రోజుల్లో బరువు పెరగడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. దీన్ని తగ్గించుకోవడానికి జిమ్‌కి వెళ్లడం, కఠినమైన డైట్ ఫాలో అవ్వడం చేస్తారు. కానీ మీకు తెలుసా.. కొన్ని యోగా ఆసనాలు సింపుల్గా నిలబడి చేస్తూ ఎంతో బరువు తగ్గొచ్చు అని..? ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడమే కాకుండా శరీరానికి మంచి ఫ్లెక్సిబిలిటీ ఇస్తాయి. క్రమం తప్పకుండా చేస్తే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు పొందవచ్చు.
1/5తాడాసనం చాలా సులభమైనా, ప్రభావవంతమైన యోగా ఆసనం. ఈ ఆసనం చేయడం వల్ల శరీర ధారణ (పోష్చర్) సరిగా ఉంటుంది. అలాగే కండరాల నొప్పులు లాంటివి ఎప్పటికీ రాదు. రోజుకు 5 నిమిషాలు తాడాసనం చేయడం ద్వారా పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వు తగ్గుతుంది.
2/5వృక్షాసనం శరీరానికి మంచి షేప్ ని తీసుకువస్తుంది. ఈ యోగా చేయడం వల్ల ముఖ్యంగా కడుపు.. తొడల కొవ్వు తగ్గుతుంది. అదేవిధంగా కోర్ మసిల్స్ బలపడతాయి. మానసిక ప్రశాంతత కోసం కూడా ఇది చాలా ఉపయోగకరం.
3/5త్రికోణాసనం చేయడం సులభం. ఈ ఆసనంలో శరీరం పక్క దిశలో స్ట్రెచ్ అవుతుంది. ఇది కడుపు, నడుము ప్రాంతంలో కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. నిరంతరం ఈ ఆసనం చేస్తే శరీరం కరెక్ట్ స్ట్రక్చర్ లో ఉంటుంది.
4/5ఈ ఆసనాన్ని ‘చెయిర్ పోజ్’ అని కూడా అంటారు. నిలబడి కుర్చీలో కూర్చున్నట్టుగా చేయాల్సిన ఈ యోగా ఆసనం తొడలు, హిప్స్, కాళ్లలోని కొవ్వును కరిగిస్తుంది. అలాగే ఫ్యాట్ బర్నింగ్ వేగంగా జరుగుతుంది.
5/5జిమ్‌కి వెళ్లకుండానే, ఖరీదైన డైట్‌లు పాటించకుండానే, ఈ నిలబడే యోగా ఆసనాలను ఇంట్లోనే సులభంగా చేయవచ్చు. అయితే వీటిని ప్రారంభించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శరీరాకృతి మెరుగుపడటమే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది.