Tips To Get Personal Loans: లోన్ కోసం బ్యాంక్‌లను సంప్రదిస్తే.. ఆధార్, పాన్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్‌మెంట్, పే స్లిప్స్.. ఇలా చాలా రకాల డాక్యుమెంట్స్ అడుగుతారు. అన్ని ఇచ్చినా.. సిబిల్ స్కోరు తక్కువ ఉన్నా.. ఎక్కువ లోన్స్ ఎంక్వైరీ చేసినా లోన్ పొందేందుకు అనర్హులు అవుతారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే మీ బడ్జెట్‌తో ఈ ఐదు పనులు తప్పకుండా చేయండి.
1/7తమ అవసరాల కోసం ప్రస్తుతం చాలా మంది లోన్స్ కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. బయట వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకునే బదులు బ్యాంకులలో లోన్ తీసుకుని ప్రతి నెల కొంత మొత్తంలో చెల్లించి కష్టాల నుంచి గట్టెక్కవచ్చని భావిస్తున్నారు.
2/7అయితే బ్యాంకులు అందరికీ ఈజీగా లోన్లు ఇవ్వవు. ముఖ్యంగా ఆదాయం ఆధారంగా రుణాలు మంజూరు చేస్తాయి. ఆదాయం ఉన్నా.. సిబిల్ స్కోరు పరిగణలోకి తీసుకుంటాయి.
3/7మీకు బ్యాంకుల నుంచి సులభంగా లోన్ మంజూరు కావాలంటే.. కచ్చితంగా మీ సిబిల్ స్కోరు 750 పైన ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటే.. బ్యాంకు లోన్ ప్రాసెస్ ఈజీగా కంప్లీట్ చేస్తాయి.
4/7మీరు ఇప్పటికే లోన్స్ తీసుకున్నట్లయితే ఈఎంఐలు సక్రమంగా చెల్లించండి. డ్యూ డేట్ అయిన తరువాత ఆలస్యంగా ఈఎంఐలు చెల్లిస్తే.. మీ సిబిల్ స్కోరు ప్రభావం చూపుతుంది.
5/7మీరు క్రెడిట్ కార్డు వాడుతుంటే.. అందులో 30 శాతం మాత్రమే ఖర్చు చేయండి. మీ కార్డు లిమిట్ రూ.లక్ష అయితే.. అందులో రూ.30 వేలు మాత్రమే ఖర్చు చేయండి. మీరు ఎక్కువగా క్రెడిట్‌పై ఆధారపడడం లేదని చూపిస్తుంది.
6/7ఎక్కువగా లోన్స్ కోసం ప్రయత్నించినా.. క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసినా.. బ్యాంకులు విచారిస్తాయి. మీ సిబిల్ స్కోరుపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అనవసరంగా కొత్త లోన్స్, కొత్త క్రెడిట్ కార్డుల జోలికి వెళ్లకండి.
7/7మీకు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు.. ఆన్‌టైమ్‌లో పేమెంట్స్ చేస్తుంటే మీ సిబిల్ స్కోరు పెరుగుతుంది. అయితే క్రెడిట్ కార్డుల బిల్లు చెల్లించేందుకు లోన్స్ తీసుకుంటే చిక్కుల్లో పడతారు. మీ సిబిల్ స్కోర్ మంచిగా మెయింటెన్ చేస్తే.. రుణాలు సులభంగా లభిస్తాయి. (గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం అందజేసినది. ఆర్థిక సలహాదారుని సంప్రదించి లోన్స్‌పై నిర్ణయం తీసుకోండి..)