Happy Vijayadashami Wishes In Telugu: విజయదశమి పండగను హిందువులు అత్యంత కీలకమైన పండగగా భావిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున అందరూ బాగుండాలని కోరుకుంటూ.. ఇలా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలను తెలియజేయండి.
Happy Vijayadashami Wishes In Telugu: తెలుగు రాష్ట్ర ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలు విజయదశమి ఒకటి. ఈ విజయదశమి పండగను దసరా పండుగగా కూడా పిలుస్తారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించేందుకు ఈ పండగను భారతీయులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నవరాత్రి ఉత్సవాల పది రోజుల తర్వాత ఆశ్వయుజ శుక్ల పక్షం దశమి రోజున ఈ పండగను జరుపుకుంటారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన పండుగ రోజున అందరూ బాగుండాలని.. మీ మేలుకోరి వారికి ఇలా విజయదశమి శుభాకాంక్షలు తెలపండి..
1/5అహంకారం పై విజయం.. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి గుర్తింపుగా.. దసరా పండగను జరుపుకుంటారు.. ఇంతటి ప్రత్యేకత కలిగిన పండుగ రోజున అందరూ బాగుండాలని కోరుకుంటూ.. ఇలా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయండి.
2/5మీ జీవితంలో ఆ దుర్గాదేవి ఆశీస్సులతో సకల విజయాలు వెల్లువిర్యాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరున విజయదశమి శుభాకాంక్షలు..
3/5ఈ దసరా పండగ మీ మనసులోని చెడు ఆలోచనలను తొలగించి.. మంచి లక్ష్యాలను తీసుకురావాలని కోరుకుంటూ.. మీ అందరికీ పేరుపేరునా దసరా శుభాకాంక్షలు..
4/5దసరా పండగ కొత్త ఆరంభాలకు నాంది పలికే ఓ అద్భుతమైన పర్వదినం.. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండగ నుంచి మీ ప్రయత్నాలన్నీ దిగ్విజయం కావాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు..
5/5ఈ దసరా పండను ప్రతి ఏడాది లాగా ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుంటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు..