Add Zee Business As A Preferred Source
App

Best Weight Loss Tips: ఇవి తింటే మీ నడుము మల్లెతీగలా మారిపోవడం ఖాయం.. బెల్లీ ఫ్యాట్ కరిగించే సూపర్ టిప్స్ ఇవే..!

Published: Sep 05, 2025, 04:52 PM IST|Updated: Sep 05, 2025, 04:52 PM IST

Belly Fat Burning Foods: ప్రస్తుతం మారుతున్న ఆరోగ్య అలవాట్ల కారణంగా చాలామంది అధిక బరువుతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్న చాలామంది బెల్లీ ఫ్యాట్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పొట్ట చుట్టూ పెరిగిపోయిన కొవ్వు అంత తేలికగా కరగదు. ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే మీ జీవనశైలి కచ్చితంగా మార్చుకోవాలి. మంచి ఆహారం, వ్యాయామాలతో బెల్లీ ఫ్యాట్‌ను సింపుల్‌గా తగ్గించుకోవచ్చు. వివరాలు ఇలా..

Belly Fat Burning Foods1/7

బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. అయితే అసాధ్యం మాత్రం కాదు. సరైన ఆహార విధానం పాటిస్తే.. ఈ సమస్య నుంచి బయటపడవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మీ పొట్టను ఫ్లాట్‌గా మార్చుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించండి.

Best Weight Loss Tips2/7

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి నీటిని త్వరగా గ్రహించి.. జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిగా చేస్తాయి. అవకాడో, చిక్కుళ్ళు, అవిసె గింజలు, బ్లాక్‌బెర్రీస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తింటే.. చాలా సేపు కడుపు నిండిన అనుభూతిని ఉంటుంది.

 

Weight Loss3/7

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటే శరీరంలో కేలరీలు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. ఇది బొడ్డు కొవ్వు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది. ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల ఆకలిని తగ్గించే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది చాలా సమయంపాటు కడుపు నిండిన అనుభూతిని ఉంటుంది. మీ రోజువారీ ఆహారంలో తక్కువ కొవ్వు మాంసం, చేపలు, గుడ్లు, బీన్స్, పాల ఉత్పత్తులను తీసుకుంటే ఉత్తమం.

 

Tips To Lose Belly Fat4/7

బొడ్డు కొవ్వు తగ్గడానికి మీ శరీరాన్ని వీలైనంత హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఎక్కువగా నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్, వ్యర్థాలను బయటకు పంపి.. ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.

Belly Fat Loss Drink5/7

షుగర్, షుగర్‌ పానీయాలను వీలైనంత వరకు తగ్గించుకోండి. ముఖ్యంగా షుగర్ లెవెల్స్ శరీరానికి చాలా ప్రమాదకరం. ఇది అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. అంతేకాకుండా కాలేయంలో కొవ్వు ఉత్పత్తిని పెంచుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండడంతో ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేయాలి. ఎక్కువగా బీర్ తాగడం వల్ల బొడ్డు కొవ్వు పెరుగుతుంది.

Belly Fat Exercise For Women6/7

వీటితోపాటు ప్రతిరోజూ రాత్రి భోజనం తర్వాత 10 నుంచి 15 నిమిషాలు వాకింగ్ చేయండి. ఉదయం లేవగానే నడక లేదా జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయండి. వారానికి కనీసం 150 నిమిషాలు ఈ వ్యాయామాలు చేస్తే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Belly Fat Burner7/7

మీ బొడ్డు చుట్టూ కొవ్వ ఎక్కువగా పెరుగుతుంటే.. వైద్యుడు సూచించిన విధంగా హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) ప్రయత్నించండి. ధ్యానం, యోగా, లోతైన శ్వాస తీసుకోండి. అదేవిధంగా శరీరానికి తగినంత నిద్ర ముఖ్యం. (గమనిక: ఇక్కడ అందజేసిన వార్త ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. జీ తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు.)