Best Zodiac Sign: హోలీ రోజే చంద్రగ్రహణం, సూర్యుడి సంచారం.. కొన్నేళ్ల తర్వాత ఈ రాశుల వారికి బంపర్ జాక్పాట్.. డబ్బుల వర్షమే!

Effects of Lunar Eclipse 2025 on Zodiac Signs:  హోలీ పండగ రోజు ఏర్పడి చంద్రగ్రహణం సూర్యుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి జీవితంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆర్థికంగా చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా అనేక సమస్యలు తొలగిపోతాయి. 

Lunar Eclipse 2025 Best Zodiac Sign Outcomes: హిందూ పురాణాల ప్రకారం పాల్గొన పౌర్ణమి రోజున హోళికా దహనం జరుగుతుంది. ఆ తర్వాతి రోజు హోలీ పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది హోలీ పండగ మార్చి 14వ తేదీన వచ్చింది. అంతేకాకుండా ఇదే రోజు ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. గ్రహాలకు రారాజుగా పరిగణించే సూర్యుడు కూడా మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా హోలీ పండుగ రోజున ఎన్నో యాదృచ్చికాలు ఏర్పడబోతున్నాయి. 
 

1 /5

హోలీ పండగ రోజు జరిగే చంద్రగ్రహణం, సూర్యుడి సంచారం కొన్ని రాశుల వారికి ఎంతో అదృష్టాన్ని కలిగించబోతోంది. ఈ మొదటి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ ఎంతో కొంత ప్రభావం ఉంటుందని ఖగోళ శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది.   

2 /5

తులారాశి వారికి మార్చి 14వ తేదీ నుంచి స్వర్ణ యుగం ప్రారంభమవుతుంది. వీరికి కెరీర్ పరంగా ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే కొత్త పనుల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. దీంతోపాటు ఉద్యోగాలు చేసే వారికి అద్భుతమైన అవకాశాలు కూడా కలుగుతాయి.   

3 /5

మార్చి 14వ తేదీ నుంచి వృషభ రాశి వారికి కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది.  ఈ యాదృచ్చికాల సంభవించడం వల్ల కెరీర్ పరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా దూరమవుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి పదోన్నతులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఆర్థికంగా ఊహించని ధన లాభాలు పొందుతారు.

4 /5

  హోలీ పండుగ రోజున ఏర్పడి ఈ యాదృచ్ఛికం వల్ల కర్కాటక రాశి వారికి కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో అదృష్టం సహకరించి.. కొత్త ఉద్యోగాలు కూడా పొందుతారు. అలాగే నీపై నిందలు వేసే వారికి కూడా చెడు జరగబోతున్నట్లు తెలుస్తోంది. 

5 /5

మిధున రాశి వారికి హోలీ పండగ ఎంతో సంతోషంగా జరుగుతుంది. ముఖ్యంగా అనేక దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉపశమనం కూడా కలుగుతుంది. అలాగే మిథున రాశి వారికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల చిన్న చిన్న వ్యాధులు కూడా తొలగిపోతాయి.