Add Zee Business As A Preferred Source
App

Bhagini hastha bhojanam: భగినీ హస్త భోజనం..15 సం తర్వాత ఇలాంటి యమ ద్వితీయ పర్వదినం..ఈరోజు చెల్లెలు..అన్నకి భోజనం పెట్టడం తప్పనిసరి..!

Written ByVishnupriya
Published: Oct 23, 2025, 02:18 PM IST|Updated: Oct 23, 2025, 02:18 PM IST

Bhagini hastha bhojanam 2025: దీపావళి పర్వదినం ముగిసిన మరుసటి రోజును భగినీ హస్త భోజనం లేదా యమ ద్వితీయగా జరుపుకుంటారు. ఈ రోజు అన్నాచెల్లెళ్ల ప్రేమ, అనుబంధాన్ని గుర్తుచేసే అద్భుతమైన పండుగగా హిందువులు ఎంతో భక్తితో పాటిస్తారు. కార్తీక శుద్ధ ద్వితీయ రోజున ఈ పర్వదినం వస్తుంది. దీనిని భాయిదూజ్, కాంతి ద్వితీయ, భ్రాతృ ద్వితీయ, పుష్ప ద్వితీయ అని కూడా పిలుస్తారు.

Bhagini hastha bhojanam significance1/5

భగినీ హస్త భోజనం 2025

పురాణాల ప్రకారం.. సూర్యభగవానుని కుమారుడు యముడు మరియు ఆయన చెల్లెలు యమునా. ఒకసారి యమున తన అన్నను ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. కానీ యముడికి పనుల వల్ల రావడం సాధ్యపడదు. తర్వాత ఒకరోజు యముడు మార్కండేయ మహర్షి ప్రాణాలు తీసేందుకు వెళ్తాడు. ఆ బాలభక్తుడు శివుని ప్రార్థించడంతో, శివుడు యముడిపై కోపగించి ఆయనను వెంటాడుతాడు. ఆ భయంతో యముడు తన చెల్లెలు యమున ఇంట్లో తలదాచుకుంటాడు.

Bhagini hastha bhojanam date2/5

భగినీ హస్త భోజనం 2025

అన్నను చూసి యమున ఆనందంతో ఆయనకు ఆతిథ్యం అందిస్తుంది. ప్రేమతో వండి వడ్డిస్తుంది. యముడు ఆ భోజనంతో సంతోషించి చెల్లెలికి వరం ఇస్తాడు.. “ఈ రోజున నీ ఇంట భోజనం చేసే అన్నదమ్ములు ఎవరైనా, వారికి ఎప్పటికీ అపమృత్యు భయం ఉండదు” అని అనుగ్రహిస్తాడు. అప్పటి నుంచి ఈ రోజున సోదరులు సోదరిమణుల ఇంట భోజనం చేయడం ఆనవాయితీ అయింది.  

Bhagini hastha bhojanam date time 3/5

భగినీ హస్త భోజనం 2025

అలాగే మరొక పురాణ కథ ప్రకారం, శ్రీకృష్ణుడు నరకాసురుని వధించి ఇంటికి వస్తాడు. అప్పుడు ఆయన చెల్లెలు సుభద్ర హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్ది ప్రేమగా భోజనం పెట్టుతుంది. ఈ సందర్భమే తర్వాత “భగినీ హస్త భోజనం” పర్వదినంగా ప్రాచుర్యం పొందింది. ఈ రోజున సోదరిమణులు తమ అన్నదమ్ములను ఇంటికి ఆహ్వానించి, వారి నుదుట తిలకం దిద్ది, హారతి ఇచ్చి, ప్రేమతో వండిన వంటకాలు తినిపిస్తారు. సోదరులు కూడా చెల్లెళ్లకు చీరలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, బహుమతులు అందిస్తారు. ఇలా ఇద్దరి మధ్య ప్రేమ, పరస్పర గౌరవం బలపడుతుంది.

Bhagini hastha bhojanam story 4/5

భగినీ హస్త భోజనం 2025

భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగకు వేర్వేరు పేర్లు ఉన్నాయి — మహారాష్ట్రలో భయ్యా-దుజ్, పంజాబ్‌లో టిక్కా, నేపాల్‌లో భాయి-టికా అని పిలుస్తారు. సోదరులు లేని వారు చంద్రునికి హారతి ఇచ్చి భగినీ హస్త భోజనం పర్వదినాన్ని జరుపుకుంటారు.

Bhagini hastha bhojanam near me5/5

భగినీ హస్త భోజనం 2025

ఈ రోజున చేసే పూజలు, దానధర్మాలు విశేష పుణ్యఫలాన్ని ఇస్తాయని నమ్మకం. స్మృతి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి, భవిష్య పురాణం వంటి గ్రంథాల్లో ఈ పర్వదిన విశేషాలు వివరించబడ్డాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఈరోజు వచ్చిన కానీ.. ఈ సంవత్సరం గ్రహాల మార్పిడి వల్ల.. ఈరోజుకి మరింత ప్రత్యేకత వచ్చింది. కాబట్టి ఈరోజు తప్పకుండా.. భగినీ హస్త భోజనం.. ఆచరించడం వల్ల అన్నాచెల్లెళ్లకు ఎంతో మంచి చేకూరుతుంది.