Bank Holiday Today: నేటి నుంచి దాదాపు పది రోజులపాటు బ్యాంకులకు సెలవు దినాలను ప్రకటించింది ఆర్బిఐ. అయితే ఈ సెలవు దినాలు ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఇంతకీ ఎక్కడెక్కడ ఈ పది రోజుల సెలవులు వర్తిస్తాయి అన్న విషయానికి వెళితే..
1/5ప్రస్తుతం నవరాత్రి పండుగ ఉత్సవాలు చాలా ప్రాంతాలలో జరుపుకుంటున్నారు. దీని కారణంగా దేశంలో వరుసగా పది రోజులపాటు బ్యాంకులు హాలిడే ఇవ్వబోతున్నారు. మరి కొద్ది రోజులలో అక్టోబర్ నెల కూడా ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం దేశంలోని హిందువులు ఎక్కువగా నవరాత్రి పండుగను ఒక పండుగలా జరుపుకుంటున్నారు. అయితే ఈ సెలవులు వివిధ రాష్ట్రాలలో వేరువేరు రోజులలో కూడా ఉంటాయి. మరి ఈ మేరకు RBI విడుదల చేసిన సెలవు దినాలను ఒకసారి ఇప్పుడు చూద్దాం
2/5ఈ ఏడాది దీపావళి, దసరా, ఛత్ పూజ, దుర్గా పూజా వంటి ఇతర పండుగలు కూడా జరుపుకుంటారు. ఈ సెలవులు బ్యాంకు నిమిత్తం పనులు చేసుకునే వారికి చాలా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే సెప్టెంబర్ 27 నాలుగవ శనివారం, 28 ఆదివారం సెలవు.
3/5సెప్టెంబర్ నెలలో సెలవులు:
29 (సోమవారం).. అగర్తల, గాంగ్టక్, కోల్ కతా వంటి ప్రాంతాలలో సెలవు .మహాసప్తమి లేదా దుర్గాదేవి పూజ గా భావిస్తారు.
సెప్టెంబర్ 30 (మంగళవారం) అగర్తల, భువనేశ్వర్, కోల్కతా, గౌహతి, పాట్నా, రాంచి వంటి ప్రాంతాలలో బ్యాంకులకు హాలిడే. దుర్గాష్టమి సందర్భంగా సెలవు.
అక్టోబర్ 1: విజయదశమి , ఆయుధ పూజ, దుర్గ పూజల కోసం బ్యాంకులను మూసివేస్తారు. (అస్సాం, సిక్కిం, అరుణాచల ప్రదేశ్, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, మేఘాలయ)
4/5అక్టోబర్ 2: గాంధీ జయంతి దేశవ్యాప్తంగా జాతీయ సెలవు.
అక్టోబర్ 3: సిక్కిం లో దుర్గా పూజ కారణంగా రెండు రోజులు బ్యాంకులకు హాలిడే.
అక్టోబర్ 5: ఆదివారం హాలిడే..
అక్టోబర్ 6: త్రిపుర, పశ్చిమ బెంగాల్లో లక్ష్మీ పూజ కారణంగా బ్యాంకులకు హాలిడే
అక్టోబర్ 7: ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, చండీగఢ్ వంటి ప్రాంతాలలో బ్యాంకులు మూసి వేస్తారు. మహర్షి వాల్మీకి జయంతి, కుమార్ పూర్ణిమ వంటివి ఇక్కడ జరుపుకుంటారు.
5/5అయితే అక్టోబర్ నెలలో కొన్ని రాష్ట్ర నిర్దిష్ట సెలవులు కూడా ఉంటాయి. పండుగల సమయాలలో ఆయా రాష్ట్రాల సౌకర్యాలను వినియోగించుకుంటారు.