EPFO Latest Updates: EPF వినియోగదారులకు బిగ్ అలర్ట్. తప్పుడు కారణాలతో పీఎఫ్ విత్ డ్రా చేసే వారికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) హెచ్చరిక జారీ చేసింది. సరైన కారణం లేకుండా PF విత్ డ్రా చేస్తే.. జరిమానా, వడ్డీతో కలిపి రికవరీ చేసే అధికారం తమకుందని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా..
1/6అత్యవసర పరిస్థితుల్లో EPF ఖాతాదారులు తమ పీఎఫ్ అకౌంట్ నుంచి విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. అయితే డబ్బులు తీసుకునే సమయంలో సరైన కారణం అందించాల్సి ఉంటుంది.
2/6హెల్త్ ఎమర్జెన్సీ, వివాహం, పిల్లల చదువు, ఇంటి నిర్మాణం కోసం పార్షియల్‌గా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకు తగిన పేపర్స్ అందించాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత/రిటైర్మెంట్ వయసుకు చేరుకున్నాకే PF విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.
3/61952 EPF స్కీమ్‌లో సెక్షన్ 68B (11) ప్రకారం.. ఒక సభ్యుడు ఉపసంహరించుకున్న డబ్బులను దుర్వినియోగం చేసినట్లు తేలితే.. వారు రాబోయే మూడు సంవత్సరాల పాటు వారి PF ఖాతా నుంచి విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండదు.
4/6అంతేకాదు వడ్డీతో సహా మొత్తాన్ని పూర్తిగా తిరిగి రికవరీ చేసుకునే అధికారం ఈపీఎఫ్ఓకు ఉంటుంది. అందుకే పీఎఫ్ నుంచి విత్ డ్రా చేసుకునే సమయంలో సరైన కారణం పీఎఫ్ విత్ డ్రా చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
5/6"సరైన కారణాలు లేకుండా పీఎఫ్ విత్ డ్రా చేస్తే.. 1952 ఈపీఎఫ్ పథకం కింద రికవరీకి దారితీయవచ్చు. మీ భవిష్యత్తును భద్రపరచుకోండి. నిజమైన అవసరాలకు మాత్రమే పీఎఫ్‌ను ఉపయోగించండి. మీ పీఎఫ్ మీ జీవితాంతం భద్రతా రక్షణ!" అంటూ ఈపీఎఫ్‌ఓ ట్వీట్ చేసింది.
6/6పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే.. UAN యాక్టివేట్ అయి ఉండి.. రిజస్టర్డ్ మొబైల్ నంబరుకు లింక్ అయి ఉండాలి. ఆధార్ నంబర్‌ను EPFO డేటాబేస్‌తో లింక్ చేయాలి. eKYC ధృవీకరణను పూర్తి చేయాలి. బ్యాంక్ ఖాతా అకౌంట్, IFSC కోడ్‌ను అప్ డేట్ చేయాలి.