Add Zee Business As A Preferred Source
App

Tomorrow Wine Shops Close: మందుబాబులకు బిగ్‌ అలర్ట్‌! రేపు వైన్‌ షాపులు బంద్‌

Published: Apr 20, 2025, 08:36 PM IST|Updated: Apr 20, 2025, 08:39 PM IST

Tomorrow Wine Shops Close In Hyderabad For 28 Hours: మందుబాబులకు బిగ్‌ అలర్ట్‌ రేపు మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. తెలంగాణలో కీలకమైన ఎన్నికలు జరగనుండడంతో మద్యం షాపులు బంద్‌ కానున్నాయి. అయితే కేవలం హైదరాబాద్‌ (సికింద్రాబాద్‌ కూడా)లో మాత్రమే మద్యం దుకాణాలు మూత పడనుండడంతో మందుబాబులకు ఊరట లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Wines Close1/6

Wine Shops Close

మందుబాబులకు బిగ్‌ అలర్ట్‌. తాగుబోతులకు భారీ షాక్‌ తగిలింది. రేపు మద్యం దుకాణాలు మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తెలంగాణవ్యాప్తంగా కాకుండా హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు మూసి ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత మరో రోజు డ్రై డే ప్రకటించడంతో మందుబాబులకు భారీ షాక్‌ తగిలింది. అయితే ఎక్కడ మద్యం దుకాణాలు బంద్‌ ఉంటాయో తెలుసా?

Tomorrow Wine Shops Close2/6

Tomorrow Wines Close

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా జంట నగరాల్లో (హైదరాబాద్‌, సికింద్రాబాద్‌) సోమవారం సాయంత్రం 4 నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలతోపాటు బార్‌లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో మద్యం అమ్మకాలు ఉండవని అధికారులు ప్రకటించారు.

Tomorrow Wines Close In Hyderabad3/6

Tomorrow Wine Shops Close In Hyderabad

హైదరాబాద్‌లోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మంగళవారం జరగనుంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నిక సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు.

Wines Close In Hyderabad4/6

Wine Shops Close In Hyderabad

హైదరాబాద్‌, సికింద్రాబాద్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలతోపాటు బార్లు, క్లబ్బుల్లో మద్యం విక్రయాలు నిలిచిపోనున్నాయి. మద్యంతో ఓటర్లను ప్రభావితం చేయడంతోపాటు ఘర్షణలు.. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయనే భావనతో ప్రతి ఎన్నికలకు మద్యం దుకాణాలు బంద్‌ ఉండే విషయం తెలిసిందే.

Wines Close In Hyderabad5/6

Wines Close In Twin Cities

ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి హింస.. అల్లర్లు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మద్యం దుకాణాలు మూతవేస్తున్నట్లు అధికారులు వివరించారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం మద్యం దుకాణాలు తెరచుకుంటాయని ప్రకటించారు.

Wines And Bars Close In Hyderabad6/6

Wine Shops And Bars Close In Hyderabad

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండూ ప్రధాన పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు కాంగ్రెస్‌ పోటీ చేయకపోగా.. ఏఐఎంఐఎం పార్టీ, బీజేపీ బరిలో నిలిచాయి. అయితే ఉన్న బలాబలాలు చూస్తే ఎంఐఎం పార్టీకి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి.