Big Announcement On 8th Pay Commission Retired Govt Employees: ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై తాజాగా ఓ వార్త ఉద్యోగ వర్గాలను తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా రిటైరయిన ఉద్యోగులకు ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఆ ప్రకటనతో ఉద్యోగుల్లో నెలకొన్న గందరగోళానికి స్పష్టతనిచ్చింది. అదేమిటో తెలుసుకుందాం.
కొత్త వేతన సంఘం ప్రకారం రిటైర్డయిన ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కవని విస్తృతంగా ప్రచారం జరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ విషయాలపై కీలక ప్రకటన చేసింది. మాజీ ఉద్యోగుల్లో నెలకొన్న గందరగోళానికి తెరతీసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ఆర్థిక చట్టం-2025 తెలిసిందే. ఈ చట్టం కింద రిటైరైన ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), వేతన సంఘం (సెంట్రల్ పే కమిషన్-సీపీసీ) ప్రయోజనాలను నిలిపివేశారనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇది తెలుసుకున్న రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ అంశం కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరింది. వెంటనే ఈ అసత్య ప్రచారంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇది అసత్య ప్రచారం అని చెబుతూ పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం కీలక ప్రకటన చేసింది. జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది.
ఫైనాన్స్ యాక్ట్-2025 కింద డీఏ, వేతన సంఘం ప్రయోజనాలను నిలిపివేశారంటూ వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్ ప్రకటించింది. ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మరాదని సూచించింది. ఒక ప్రకటనను ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.
ఆర్థిక చట్టం-2025 ప్రకారం.. ఇతర కారణాలతో తొలగించిన ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రమే పదవీ విరమణ ప్రయోజనాలు (రిటైర్‌మెంట్ బెనిఫిట్స్) నిలిచిపోతాయని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ తెలిపింది. సీసీఎస్ (పెన్షన్) రూల్స్, 2021లోని రూల్ 37ను సవరించినట్లు వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువరించామని.. ప్రస్తుతం వాట్సప్‌లో విస్తృతమవుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని స్పష్టం చేసింది.