Add Zee Business As A Preferred Source
App

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌.. 6 శాతం డీఏ ప్రకటించిన రాష్ట్ర సర్కార్

Published: Oct 08, 2025, 07:50 PM IST|Updated: Oct 08, 2025, 07:50 PM IST

DA And DR Hiked By 6 Percent For Govt Employees And Pensioners: పండుగల నేపథ్యంలో ఉద్యోగులు, పింఛన్‌దారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త ప్రకటిస్తున్నాయి. దసరాకు ఇప్పటికే కానుకలు అందించగా.. తాజాగా దీపావళిని పురస్కరించుకుని ఓ రాష్ట్ర ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

1/5

పండుగలు వస్తున్నాయంటే అందరి మాదిరి ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు కూడా ఆశగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. భారీ స్థాయిలో కరువు భత్యం ప్రకటించింది. ఈ ప్రకటనతో ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీ ఆర్థిక ప్రయోజనం లభించనుంది.

2/5

ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), రిటైర్డ్‌ ఉద్యోగులకు డీఆర్‌ పెంచుతున్నట్లు సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రాథమిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, పింఛన్‌దారులకు అదనంగా రెండు శాతం డీఏ, డీఆర్‌ పొందనుండగా.. ఇది 55 శాతానికి పెరగనుంది.

3/5

తాజా పెంపుతో డీఏ, డీఆర్‌ 252 శాతానికి పెరుగుతుందని సిక్కిం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ పెంపు 5 జనవరి 2025 నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కూడా ఈ ప్రయోజనం లభించనుండడం విశేషం.

4/5

దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమంగ్‌ శుభవార్త చెప్పారు. పెంచిన డీఏ, డీఆర్‌తో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలగనుంది.

5/5

ప్రభుత్వం ప్రకటించిన డీఏ, డీఆర్‌ పెంపుతో ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఊరట లభించనుంది. కనీస వేతనాల్లో కొంత మెరుగవుతుంది. పింఛన్‌దారులకు కూడా సాంత్వన లభించనుంది. అయితే పెంచిన డీఏ, డీఆర్‌ మాత్రం హెచ్‌ఆర్‌ఏ, మిగతా వాటిపై ప్రభావం చూపదు.