Add Zee Business As A Preferred Source
App

Big Boss: బీదరికం నుండి బిగ్‌బాస్ వరకు.. ఈ సింగర్ జర్నీ చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Written ByAruna Maharaju
Published: Sep 16, 2025, 06:42 PM IST|Updated: Sep 16, 2025, 06:42 PM IST

Ramu Rathod In Big Boss: ఫోక్ సాంగ్స్‌లో ‘రాను బొంబైకి రాను’ అనే పాట ఎంత ట్రెండ్ సెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్‌లో 534 మిలియన్స్ వ్యూస్‌తో.. ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. ఫంక్షన్స్, పార్టీలు.. ఇలా ఎక్కడా విన్న ఈ పాటే.. భాషతో సంబంధం లేకుండా ప్రపంచమంతటా తన మార్క్‌ని క్రియేట్ చేసింది. ఇక ఈ పాటతో ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు రాము రాథోడ్. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 రియాల్టీ షోలో ఆడుతున్నాడు. అయితే ఇక్కడి వరకు చేరుకోవడానికి రాము రాథోడ్ పడ్డ కష్టం చూస్తే.. ఎవరికైనా కన్నీళ్లు రావాల్సిందే..!

Folk Singer Ramu Rathod1/5

రాము రాథోడ్

‘రాను బొంబైకి రాను’ సాంగ్‌తో రాము రాథోడ్ అందరి ఇళ్లలో ఒక్కడిగా అయిపోయాడు. ఈ ఒక్క పాటతో సోషల్ మీడియాలో రాము రాథోడ్ క్రియేట్ చేసిన మార్క్ అంతా ఇంతా కాదు. ఇక ఈ పాటతో ఎంతో ఫేమస్ అయిన ఈ ఫోక్ సింగర్ ఓ చిన్న గ్రామం నుంచి వచ్చి.. ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 రియాల్టీ షోలో అందరినీ అలరిస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో రాము తల్లిదండ్రులు చెప్పిన మాటలు.. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.     

Ramu Rathod2/5

బిగ్ బాస్ సీజన్ 9

మహబూబ్‌నగర్ జిల్లాలోని గోపాలపూర్ ఖుర్ద్ గ్రామంలో పుట్టి పెరిగిన రాము రాథోడ్‌కి.. చిన్నప్పటి నుంచి సింగర్ కావాలనే కోరిక ఉండేదట. అక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన రాము.. ఆ తర్వాత ముంబై వెళ్లి కష్టపడి పనిచేశాడని.. పాత ఇనుప సామాను ఏరడం, చేపలు పట్టడం వంటి పనులు చేసి రోజుకు నాలుగైదు వందల రూపాయలు సంపాదించేవాడన్నారు. 

Big boss Today Episode3/5

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు

తాము కూడా చాలా కష్టాలు పడ్డామని రాము రాథోడ్ తల్లిదండ్రులు తెలిపారు. పొట్ట కూటి కోసం చేతికి దొరికిన ప్రతి పని చేసే వారిమని.. పని చేసే దగ్గర పురుగులతో ఉన్న అన్నం పెడితే.. వాటిని పక్కన పెట్టి తిన్న సందర్భాలు ఉన్నాయని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. 

Big boss Telugu4/5

బిగ్ బాస్ తెలుగు

కొంచెం ఫేమస్ అయ్యాక మా కొడుకు మా కోసం కొత్త ఇల్లు కట్టించాడని రాము రాథోడ్ తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. మా కొడుకు కష్టంతోనే మేము ఈ రోజు ఇలా ఉన్నామని వారు చాలా భావోద్వేగంగా మాట్లాడారు. మా బిడ్డ బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.   

Ramu Rathod In Bigboss5/5

రాము రాథోడ్ సింగర్

స్టార్ మాలో ప్రసారమవుతోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రాము రాథోడ్ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్‌గా ఉన్నాడు. విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నేపథ్యంతో వచ్చిన ఈ యువకుడు..  ఇప్పుడు బిగ్ బాస్ స్టేజ్‌పై తన కామెడీ, సెన్సిబిలిటీ, హ్యూమర్‌ టచ్‌తో ఆడియన్స్‌ని అలరిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా సింగర్ రాము రాథోడ్.. ఎన్ని వారాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.