Union Govt Likely To Announce Dearness Allowance Hike Tomorrow: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్ లాంటి వార్త. రేపు డియర్‌నెస్ అలవెన్స్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. డీఏ పెరుగుదలపై ప్రకటన ఉంటుందనే ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే హోలీ పండుగకు ప్రకటించాల్సిన డీఏ పెంపును ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ స్థాయిలో పెరుగుదల ఉంటుంది? ఎప్పుడు పెరుగుతుంది? అనేది తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు రేపు భారీ శుభవార్త వినిపించే అవకాశం ఉంది. డియర్‌నెస్ అలవెన్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకటన కోసం కోటి మంది పైగా ఉద్యోగులు, పింఛన్‌దారులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ద్రవ్యోల్బణం నుంచి ఊరట చెందేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏ ప్రకటిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రతి యేటా రెండు సార్లు డీఏ పెంపు ఉంటుంది.
డియర్‌నెస్ అలవెన్స్ పెంపుపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. హోలీ పండుగకు డీఏ పెంపుపై ప్రకటన వస్తుందని ఆశించగా ఉద్యోగ వర్గాలకు నిరాశే ఎదురైంది. ఈ ప్రకటన ఎప్పుడు ఉంటుందా? అని ఉద్యోగులు, పింఛన్‌దారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు ఆందోళన చెందుతున్న సమయంలోనే బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కరువు భత్యం పెంపుపై నిర్ణయం తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి.
మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి డియర్‌నెస్ అలవెన్స్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో డీఏ పెంపుపై ఇదే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రిమండలిలో కరువు భత్యం పెంపు ఏ స్థాయిలో ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. డీఏ 2 శాతం పెరుగుతుందని పలు నివేదికలుసూచిస్తున్నాయి. ఒకవేళ అదే స్థాయిలో పెంపు ఉంటే ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఊరట లభించనుంది.