Add Zee Business As A Preferred Source
App

Liquor Prise hikes: మందు బాబులకు బిగ్ షాక్.. ఏ బ్రాండ్ ధర ఎంత పెరగనుందంటే..!

Written ByTA Kiran KumarUpdated byTA Kiran Kumar
Published: Apr 17, 2025, 03:32 PM IST|Updated: Apr 17, 2025, 03:32 PM IST

Liquor Prise hikes: తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్ గా బీర్ల ధరల పెంపుకు అనుమతులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం  తాజాగా ఇతర మద్యం బ్రాండ్ల ధరలను పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వబోతున్నట్టు సమాచారం.

Liquor Prise hikes1/5

లిక్కర్ ప్రైస్ రేట్స్

Liquor Prise hikes: ఇప్పటికే తెలంగాణ స్టేట్ లో బీర్ల ధరలను 15 శాతం మేర పెంచారు. మరోవైపు మిగతా లిక్కర్ బ్రాండ్ల ధరలను అందుకు అనుగుణంగా 10 నుంచి 15 శాతం మేర పెంచబోతున్నట్టు సమాచారం.

Beer Rate 2/5

బీర్ సీసా

తెలంగాణలో గతంలో బీర్ సీసా 150 నుంచి 160 మధ్య ఉండేది. పెంచిన ధరల తర్వాత రూ. 190 నుంచి రూ. 200 మధ్య ఉంది. అయినా.. మద్యం  ధరలు పెరిగినా.. అవేమి పట్టించుకోకుండా మద్యం బాబులు వీటిని కొనుగోలు చేస్తున్నారు.

Telangana Liquor Rates 3/5

తెలంగాణలో లిక్కర్ రేట్లు

తెలంగాణలో లిక్కర్ రేట్లు పెంపుకు ప్రభుత్వం త్వరలో అనుమతులు మంజూరు చేయనుంది. దీని ప్రకారం ఒక్కో మద్యం బాటిల్ పై రూ. 45 నుంచి రూ. 55 మధ్య పెరగనుంది.

 

Liquor Prise 4/5

ధరల పెంపు

ముఖ్యంగా ఆయా మద్యం బ్రాండ్ల ఎంఆర్పీ (మాగ్జిమ్ రిటైల్ ప్రైస్) ఆధారంగా ఈ ధరలు పెరుగుదల ఉండనుంది. ఇప్పటికే ధరలపై పెంపుపై ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

New Liquor Brands 5/5

మద్యం బ్రాండ్లు

ఆ కమిటీ ఇప్పటికే తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. దీనికి అనుగుణంగా లిక్కర్ బ్రాండ్స్ రేట్స్ పెంచేందుకు అబ్కారీ శాఖ రెడీ కానుంది. మరోవైపు తెలంగాణలో 604 కొత్త మద్యం బ్రాండ్లకు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.