Add Zee Business As A Preferred Source
App

Central Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ రిలీఫ్‌.. మోదీ సర్కార్ నిర్ణయంతో ఫుల్ హ్యాపీ

Published: Oct 17, 2025, 04:00 PM IST|Updated: Oct 17, 2025, 04:00 PM IST

Central Govt Employees Pension: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మోదీ సర్కార్ బిగ్ రిలీఫ్‌ ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ తర్వాత సకాలంలో పెన్షన్ పొందడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది. ఇక నుంచి రిటైర్‌మెంట్ అయిన తరువాత పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (PPO) కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. సకాలంలో పెన్షన్, ఇతర ప్రయోజనాలను పొందడానికి కేంద్ర కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

Central Govt Employees Pension1/7

కొత్త నిబంధనల ప్రకారం.. ఏ ఉద్యోగి కూడా పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (PPO) పొందడానికి నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది.

Central Govt Employees 2/7

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు

PPO అంటే.. పెన్షనర్లకు కేటాయించిన 12-అంకెల ప్రత్యేక సంఖ్య. ఈ సర్టిఫికెట్‌లో పెన్షనర్ పేరు, పుట్టిన తేదీ, పెన్షన్ మొత్తం, పదవీ విరమణ తేదీ వంటి వివరాలు ఉంటాయి.

 

Diwali 20263/7

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతం

 

పెన్షన్ కోసం అప్లై చేసుకునే సమయంలో వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించేటప్పుడు PPO నంబర్ అవసరం అవుతుంది. PPO నంబర్ కలిగి లేకుండా ఒక బ్యాంకు శాఖ నుంచి మరో బ్యాంకు శాఖకు PF అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడం కూడా కష్టమవుతుంది.

 

Central Government Salary4/7

కేంద్ర ప్రభుత్వం

ఉద్యోగుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు పదవీ విరమణకు ముందు పెన్షనర్లకు వారి PPO నంబర్లు జారీ చేసేలా చూసుకోవాలని ఆదేశించింది.

 

PPO New Rules5/7

మోదీ ప్రభుత్వం

అంతేకాకుండా ప్రభుత్వం అన్ని విభాగాలు తమ ఉద్యోగుల సర్వీస్ రికార్డులను డిజిటల్‌గా భద్రపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. PPO జారీతో పాటు త్వరలో డిజిటలైజేషన్, e-HRMS (ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) పూర్తి స్వీకరణ కూడా త్వరలో చేపట్టనున్నారు. సర్వీస్ రికార్డ్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటే.. పెన్షన్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం ఉండదు.

central govt employees PPO6/7

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు

ప్రస్తుతం పెన్షన్ చెల్లింపుల కోసం విజిలెన్స్ క్లియరెన్స్ పెద్ద అడ్డంకిగా మారింది. దీంతో కొత్త నిబంధనల నుంచి విజిలెన్స్ క్లియరెన్స్‌ను తొలగించారు.

 

Central government Latest News7/7

పెన్షన్ చెల్లింపు ఆర్డర్

ఒకవేళ ఒక ఉద్యోగిపై శాఖాపరమైన లేదా న్యాయపరమైన విచారణ జరుగుతున్నా.. వారు తాత్కాలిక పెన్షన్ పొందేందుకు అర్హులు. అయితే విచారణకు సంబంధించి తుది ఉత్తర్వు జారీ అయ్యే వరకు గ్రాట్యుటీ చెల్లింపులు నిలిపివేసే అవకాశం ఉంటుంది.