Big Alert For Tirumala Devotees: తిరుమల శ్రీవారి భక్తులకు కీలక సమాచారం. రేపు, ఎల్లుండి అనగా సెప్టెంబర్ 6, 7న శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా.. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుండి సోమవారం ఉదయం 3 గంటల వరకు అంటే.. 12 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసి ఉంచుతారు. ఆ సమయంలో ఎలాంటి దర్శనాలు ఉండవు
1/5శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేస్తారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సోమవారం ఉదయం 3 గంటల వరకు ఆలయం 12 గంటల పాటు మూసి ఉంటుంది. ఈ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించరు.
2/5చంద్రగ్రహణం ఆదివారం రాత్రి 9.50 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 1.31 గంటల వరకు ఉంటుంది. గ్రహణానికి 6 గంటల ముందు నుంచి ఆలయ తలుపులు మూస్తారు. సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయాన్ని తెరిచి, శుద్ధి చేస్తారు. ఆ తర్వాత పుణ్యహవచనం నిర్వహిస్తారు. స్వామివారికి తోమాల సేవ, అర్చన వంటి కార్యక్రమాలు ఏకాంతంగా జరుగుతాయి.
3/5సోమవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
4/5అలాగే ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూసివేస్తారు. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి అన్నప్రసాద వితరణ మళ్లీ ప్రారంభమవుతుంది.
5/5గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదని ఇంట్లో నిల్వ ఉంచే ఆహార పదార్థాలపై దర్భ ఉంచాలని.. గ్రహణం తర్వాత ప్రతి ఒక్కరూ స్నానం చేయాలని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు సూచించారు.