Bigg Boss 9 Telugu Contestant Ayesha: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత.. బిగ్‌బాస్ సీజన్ 9లో రచ్చ మామూలుగా ఉండటం లేదు. కొత్త హౌస్ మేట్స్ వచ్చిన దగ్గర నుంచి హౌస్ రణరంగంగా మారింది. గతవారం హౌస్ నుండి భరణి ఎలిమినేట్ అయిన విషయం తెలిసింది. అయితే ఈ వారం ఎలిమినేషన్‌కి ముందే హౌస్ నుండి ఓ కంటెస్టెంట్ బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది.
1/5బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన వారిలో అయేషా జీనత్ ఒకరు. హౌస్‌లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కంటెస్టెంట్‌కి ఇచ్చి పడేస్తుంది అయేషా.
2/5ముఖ్యంగా రీతూ చౌదరికి, అయేషాకి అయితే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. హౌస్‌లో ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం లేదు.
3/5తాజాగా బిగ్‌బాస్ హౌస్ నుండి ఆరోగ్య సమస్యల కారణంగా అయేషా బయటకు వచ్చేసిందని తెలుస్తుంది. డీహైడ్రేషన్ కారణంగా అయేషా హౌస్ నుండి సడన్‌గా వెళ్లిపోయింది.
4/5అయితే అయేషా ఆరోగ్యం సెట్ అవ్వడంతో తిరిగి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందని టాక్. గతంలో తమిళ్ బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొన్న అయేషా.. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొని సందడి చేస్తుంది.
5/5ఇక ఈ వారం నామినేషన్స్ లో రీతూ చౌదరి, తనూజ, రాము రాథోడ్, సాయి, కళ్యాణ్, రమ్య మోక్ష,సంజన, దివ్య ఉన్నారు. వీరిలో రమ్య మోక్ష ఈవారం హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఆమెకే తక్కువ ఓట్లు పడుతున్నాయి.