Bigg Boss: బిగ్‌బాస్‌ 9 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా మొత్తం ఆరుగురు.. ఎవరెవరూ ఉన్నారంటే..!

Bigg Boss 9 Telugu Wild Card Contestants: బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు రోజురోజుకు ఉత్కంఠగా సాగుతోంది. అయితే ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి. ఆదివారం ఎపిసోడ్‌లో మొత్తం ఆరుగురు రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు లీక్ అయ్యాయి. వీళ్లకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసి షాకిచ్చినట్లు తెలుస్తోంది. లక్స్ పాప ఫ్లోరాతో పాటు కామనర్ శ్రీజ.. ఐదో వారం ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసినట్లుగా సమాచారం. మరోవైపు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా ఆరుగురు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

1 /6

వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్న వారిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేమ్ రమ్య మోక్ష ఉంది. ఇన్‌స్టాలో గ్లామర్ రీల్స్ పోస్ట్ చేసే రమ్య.. ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. గొడవల విషయంలో కూడా ఎక్కడా తగ్గదు. ఈమెని ఇన్ స్టాలో ఫాలో అయ్యేవాళ్లకు ఈ విషయం తెలిసే ఉంటుంది. హౌస్‌లోకి వస్తే చాలామందికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశముంది.  

2 /6

'గోల్కోండ స్కూల్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ సాయి.. తర్వాత కాలంలో హీరోగా పలు చిత్రాలు చేశాడు. కానీ అవి ఏ మాత్రం ఇతడి కెరీర్‌కి ఉపయోగపడలేదు. ప్రస్తుతానికైతే కొత్త ప్రాజెక్టులేవి లేకపోవడంతో.. బిగ్‌బాస్‌కి ఓకే చెప్పాడు.  

3 /6

నిఖిల్ నాయర్'గృహలక్ష‍్మి' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులు బాగా పరిచయం. 'పలుకే బంగారమాయెనా' సీరియల్‌లోనూ హీరోగా నటించాడు. ఓ వెబ్ సిరీస్ కూడా చేశాడు. హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఫిజికల్ టాస్కుల్లో మిగతా వాళ్లకు పోటీ ఇవ్వడం గ్యారంటీ. సీరియల్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు కాబట్టి బాగా ఆడితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్సులున్నాయి.

4 /6

గౌరవ్ గుప్తా.. ప్రస్తుతం 'గీత ఎల్ఎల్‌బీ' అనే సీరియల్ చేస్తున్నాడు. హౌసులోకి వెళ్లిన తర్వాత అటు లవ్ ట్రాక్స్‪‌తో పాటు ఫిజికల్‌గానూ మంచి పోటీ ఇచ్చే ఛాన్సుంది.  

5 /6

ఆయేషా జీనత్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఈమె చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. 'సావిత్రి గారి అబ్బాయి' సీరియల్‌తో ఇక్కడ కాస్త పాపులరే. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్‌‌ రెండో సీజన్‌లోనూ పాల్గొంది. గతంలో తమిళ బిగ్‌బాస్ షోలో పాల్గొని రచ్చ రచ్చ చేసిన అనుభవం కూడా ఉంది. ఈమె వైల్డ్ కంటెస్టెంట్‌గా వైల్డ్ ఫైర్ చూపించే ఛాన్సులు గట్టిగానే ఉన్నాయి. ఆటనే కాదు గ్లామర్ పరంగానూ హౌసులోకి చాలామందికి పోటీ ఇవ్వడం గ్యారంటీ.  

6 /6

దివ్వెల మాధురి.. సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి పాపులారిటీ తెచ్చుకుంది. ఈమె వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిన్నటి వరకు సందేహంగానే ఉంది. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయిందని తెలుస్తోంది. గతంలో ఆఫర్ వచ్చినా సరే రిజెక్ట్ చేసినట్లు చెప్పింది కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇస్తుంది.