Bigg Boss: అట్టడుగుకు పడిపోయిన బిగ్ బాస్‌ 9 టీఆర్పీ రేటింగ్.. రియాలిటీ షో కాదు.. చెత్త షో అంటూ ట్రోల్స్..!

Bigg Boss Telugu 9 TRP: బిగ్ బాస్ సీజన్-9.. అబ్బబ్బా ఈ రియాలిటీ షో ప్రారంభంకాక ముందు మేకర్స్ దీనిపై ఎంత హైప్ క్రియేట్ చేశారంటే.. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడూ ఈ షో స్టార్ట్ అవుతుందో అన్నంతగా ఎదురుచూసేలా. ఇప్పటివరకూ వచ్చిన సీజన్స్ ఒక లెక్క.. ఈ తొమ్మిదవ సీజన్ ఇంకో లెక్క అన్నంత రేంజ్‌లో రకరకాలుగా ప్రోమోలు వదులుతూ బిల్డప్ ఇచ్చారు. కానీ తీరా షో స్టార్ట్ అయ్యాక చూస్తే తెలిసిందేంటంటే.. అక్కడ అంతా సీన్ ఏం లేదని. పైన పటారం లోన లొటారం అన్నట్లుగా సాగిపోతోంది బిగ్ బాస్. ఇక ఈ రియాలిటీ షోకి వస్తున్న టీఆర్పీ రేటింగ్స్ చూస్తే కళ్లు తిరగాల్సిందే.

1 /5

బిగ్ బాస్‌ 9పై మొదలైన వారంలోనే ప్రేక్షకులకు ఎవర్రా మీరంతా అన్నంతగా కంటెస్టెంట్లపై విరక్తి వచ్చేసింది. పోనీ కొన్ని వారాలు గడిచిన తర్వాత అయిన ఆ ఒపినియన్ పోతుందనుకుంటే.. కంటెస్టెంట్లలో కంటెంట్‌ కరువైంది. దీంతో ఎంతో ఆసక్తికరంగా, వినూత్నంగా ఉంటుందనుకున్న బిగ్ బాస్ షో.. బోర్‌కి కేరాఫ్ అడ్రస్‌లా మారిపోయింది.

2 /5

బిగ్ బాస్‌కి ఈసారి పనికిరాని కంటెస్టెంట్స్‌ని తీసుకొచ్చారంటూ ఆడియెన్స్ బహిరంగగానే తమ అభిప్రాయాలను చెబుతున్నారు. వారాలు గడుస్తున్న కంటెస్టెంట్స్ సరైనా విధంగా గేమ్ ఆడటం లేదు. దీంతో ఇంకేముంది ఆ ఎఫెక్ట్ అంతా టీఆర్పీ రేటింగ్‌పై పడింది.

3 /5

హౌస్‌లో వరస్ట్ కంటెస్టెంట్స్ ఉండటం.. వాళ్లకి ఎఫైర్లు.. పనికిమాలిన ఓవర్‌యాక్షన్ తప్పితే.. ప్రేక్షకులకి ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇవ్వడం లేదు. అప్పట్లో బిగ్ బాస్ సీజన్ 6కి వరస్ట్ సీజన్ అనే చెత్త రికార్డ్ ఉండేది.. ఇక ఇప్పుడు సీజన్ 7 ఆ లిస్ట్‌లోకి వెళ్లిపోయింది.  

4 /5

ఓవరాల్‌గా 43 వారం టీఆర్పీ రేటింగ్ చూస్తే.. బిగ్ బాస్‌ సీజన్ 9కి అర్బన్ రూరల్‌లో కలిపి 5.03 పూర్ రేటింగ్ వచ్చింది. ఎంత దరిద్రం అంటే.. లీస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చిన సీరియల్‌ కంటే బిగ్ బాస్‌కి వచ్చిన రేటింగ్ చాలా తక్కువ.  

5 /5

వీక్ డేస్‌లో ఇంత వీక్‌గా ఉంటే.. అదే వీకెండ్‌లో శనివారం 6.63, ఆదివారం 7.13 ఉంటుంది. అంటే హోస్ట్ నాగార్జున వచ్చిన ఎపిసోడ్‌లలో కూడా సీరియల్స్ రేటింగ్‌ని దాటడం లేదు కదా అంటే.. అందులో కనీసం సగం కూడా ఉండటం లేదు. ఎంత హడావుడి చేసిన బిగ్ బాస్ సీజన్ 9 మాత్రం చెత్త షోగా చెత్త టీఆర్పీ రేటింగ్‌కి పరిమితం అయ్యింది.