Add Zee Business As A Preferred Source
App

Bigg Boss: "బిగ్‌బాస్" షో వెంటనే ఆపేయాలంటూ ప్రభుత్వం నోటీసులు.. ఎందుకో తెలుసా..?

Written ByAruna Maharaju
Published: Oct 07, 2025, 12:53 PM IST|Updated: Oct 07, 2025, 12:53 PM IST

Bigg Boss Reality Show: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ కన్నడకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ షూటింగ్   ఆపేయాలంటూ కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSPCB) నోటీసులు జారీ చేసింది. 

Bigg Boss  1/5

బిగ్ బాస్ షో

పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను.. ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ కన్నడ షూటింగ్ ఆపేయాలంటూ కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSPCB) నోటీసులు జారీ చేసింది. బెంగళూరు శివార్లలోని బిడడి హోబ్లిలోని జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్‌లో బిగ్‌బాస్ సెట్ ఉన్న విషయం తెలిసిందే. 

Bigg Boss Latest Episode2/5

బిగ్ బాస్ షో

కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతున్న ప్రకారం.. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి శుద్ధి చేయని మురుగునీటిని సైట్ బయట రిలీజ్ చేస్తున్నారని అధికారులు తెలిపారు.  దీనివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు.  

Bigg Boss Reality Show3/5

బిగ్ బాస్ షో

బిగ్‌బాస్‌ సెట్‌ దగ్గరలో 250 KLD-సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) ఏర్పాటు చేసినట్లు నిర్మాణ బృందం పేర్కొంది. అయితే అందులో సరైన అంతర్గత డ్రైనేజీ కనెక్షన్లు లేవని.. STP యూనిట్ల నిర్మాణం సరిగా లేదని అధికారులు గుర్తించారు. అధికారుల తనిఖీలో చెత్త నిర్వహణ పద్ధతులు కూడా చాలా పేలవంగా ఉన్నాయని తేలింది.   

Bigg Boss 4/5

బిగ్ బాస్ షో

ప్లాస్టిక్ కప్స్, పేపర్ ప్లేట్స్ ఇతర డిస్పోజబుల్స్ వంటి పనికిరాని వ్యర్థాలన్నీ బహిరంగంగానే వేశారని అధికారులు చెబుతున్నారు. అదనంగా, 625 kVA, 500 kVA సామర్థ్యం గల రెండు డీజిల్ జనరేటర్ సెట్‌లు అక్కడ ఏర్పాటు చేశారని.. ఇది మరింతగా పర్యావరణాన్ని పొల్యూట్ చేస్తోందని చెప్పారు.   

Bigg Boss Reality Show5/5

బిగ్ బాస్ షో

దీంతో వెంటనే బిగ్‌బాస్‌ షోను ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డు ఆదేశించింది. విద్యుత్‌ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖను సూచించింది. హీరో కిచ్చా సుదీప్‌ హోస్ట్‌గా.. బిగ్‌బాస్‌ కన్నడ సెప్టెంబర్‌ 28న ప్రారంభం కాగా.. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇలాంటి నోటీసులు రావడంతో సోషల్‌మీడియాలో ఈ వార్తలు వైరల్‌ అవుతున్నాయి.