Add Zee Business As A Preferred Source
App

Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ కంటెస్టెంట్ కి.. నాగబాబు సపోర్ట్.. ఇక మెగా అభిమానుల ఓట్లు అతనికేనా..!

Written ByVishnupriya
Published: Sep 08, 2025, 10:38 AM IST|Updated: Sep 08, 2025, 10:38 AM IST

Bigg Boss Telugu 9 Contestant :  బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్బాస్ సీజన్ 9 మొదలైపోయింది. నిన్న అంగరంగ వైభవంగా మరోసారి నాగార్జున హోస్ట్ గా.. ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ షో ని మొదలు పెట్టేశారు.. ఈ క్రమంలో తాజాగా ఒక కంటెస్టెంట్ కి మెగా అభిమానుల సపోర్ట్ మొదటి రోజు నుంచే మొదలైపోయింది. 

Bigg Boss Telugu Contestants 1/6

నాగబాబు

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 .. నిన్న ఆదివారం సెప్టెంబర్ 7వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈసారి ముందు షోల కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటూ ఇప్పటికే మేకర్స్ ఈ షో పైన అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే.

Nagababu2/6

నాగబాబు

ఇక నిన్న..ఈ సీజన్‌లో సెలబ్రెటీ కంటెస్టెంట్స్ కింద సంజనా గల్రానీ, రీతూ చౌదరి, తనూజ, ఆశాషైనీ,, శ్రేష్ఠ వర్మ, భరణి శంకర్, ఇమ్మానుయేల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి అడుగుపెట్టగా.. మరోపక్క అగ్ని పరీక్ష తో దమ్ము, మర్యాద మనీష్, మాస్క్ మెన్ హరీష్, శ్రీజ జవాన్ పవన్ కల్యాణ్, ప్రియా శెట్టి హౌస్‌లో అడుగుపెట్టారు.

Nagababu Bigg Boss3/6

నాగబాబు సపోర్ట్

ఈ క్రమంలో ఈ కాంటెస్ట్ టెన్స్ లో ఒకరికి నాగబాబు విషెస్ పెట్టి .. మెగా అభిమానుల సపోర్ట్ మొత్తం కూడా అతని వైపు మళ్లించారు. 

Nagababu Bigg Boss 4/6

నాగబాబు సపోర్ట్

అసలు విషయానికి వస్తే మెగా ఫ్యామిలీకి ఎన్నో సంవత్సరాల నుంచి సన్నిహితుడైన భరణి శంకర్.. దాదాపు 25 సీరియల్స్ పైగానే నటించారు. ముఖ్యంగా చిలాసౌ స్రవంతి.. సీరియల్ తో ఇతను చాలా ఫేమస్ అయ్యారు.  

Bharani Shankar Bigg Boss5/6

భరణి శంకర్ బిగ్ బాస్

ఈ క్రమంలో ఇతను బిగ్ బాస్ షోలోకి అరుగు పెట్టగానే.. మెగా బ్రదర్ నాగబాబు.. ‘నాకు అత్యంత సన్నిహితుడైన భరణి శంకర్ బిగ్‌బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్న క్రమంలో.. నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ ప్రయాణం అతనికి గుర్తింపుతో పాటు మంచి విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అంటా నాగబాబు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.  

Bharani Shankar Bigg Boss6/6

భరణి శంకర్ బిగ్ బాస్

ఇక ఈ పోస్ట్ పెట్టిన దగ్గర నుంచి.. ఇక మెగా అభిమానుల సపోర్టు మొత్తం ఈయనకే ఉంటుంది ఏమో అనే సందేహం అందరిలోనూ మొదలయ్యింది.