Ramu Rathod Self Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్-9 తొమ్మిదో వారంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగుతున్న తరుణంలో.. ఎవ్వరూ ఊహించని విధంగా జరిగింది. కంటెస్టెంట్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడు. అందరిని ఎమోషనల్‌కి గురి చేసి ఎంత బ్రతిమాలినా వినకుండా రాము హౌస్‌ని వీడాడు. ఈ వారం అత్యల్ప ఓట్లు పోలైన సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకుంటున్న సమయంలో రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ పెద్ద ట్విస్ట్‌గా మారింది.
ఈ వారం మొత్తం రాము రాథోడ్ డల్‌గా ఉన్న నేపథ్యంలో హోస్ట్ నాగార్జున ఏంటి రాము ఇలా ఉన్నావంటే.. ఫ్యామిలీ గుర్తుకొస్తుందని, అమ్మ గుర్తుకొస్తుందని తెలిపాడు. నిద్ర పట్టడం లేదని, అందరు ఉన్నా ఒంటరిగా ఫీలవుతున్నట్టు తెలిపాడు.
రాము రాథోడ్ పాట పాడి తన బాధని బయటపెట్టాడు. 'బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. తమది పెద్ద ఫ్యామిలీ అని.. చాలా హడావిడిగా ఉంటుందని, తాను లేకపోతే ఎలా ఉందో అనే టెన్షన్‌గా ఉందని, భయమనిస్తుందని చెప్పాడు రాము.
ఇంట్లో ఏడెనిమిది మంది పిల్లలుంటారని.. వాళ్లు గుర్తుకొస్తున్నారని, అలాగే డాగ్స్ గుర్తుకొస్తున్నాయని, ఇక్కడ ఉండలేకపోతున్నానని ఎమోషనల్ అయ్యాడు రాము. హోస్ట్ నాగార్జున ఎన్నిసార్లు అడిగినా వెళ్లిపోతా అన్నాడు. హౌజ్‌మేట్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వినలేదు. ఎట్టకేలకు సెల్ఫ్‌గా ఎలిమినేట్ అయ్యాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా భావోద్వేగానికి గురయ్యారు.
ఇక రాము రాథోడ్ మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న నాగార్జున.. బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు. దీంతో రాము రాథోడ్ బయటకు వెళ్లే అవకాశం ఇవ్వగా.. వెళ్తానని చెప్పడంతో బిగ్ బాస్ హౌస్‌లో ఈ ఫోక్ సింగర్ ప్రయాణం ముగిసింది.
ప్రస్తుతం 9వ వారం నామినేషన్స్‌లో సంజన, సుమన్ శెట్టి, భరణి, కల్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, తనూజ ఉన్నారు. ఓటింగ్ ప్రకారం సాయి శ్రీనివాస్ చివరి స్థానంలో నిలిచాడు. అయితే రాము సెల్ఫ్ ఎలిమినేట్ కావడంతో ఈ వారం మరొక ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.