Add Zee Business As A Preferred Source
App

Ramya Moksha: సోషల్ మీడియాలో ట్రోలింగ్.. నాన్న మరణం.. అంతా కొలాప్స్: అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష

Written ByAruna Maharaju
Published: Oct 13, 2025, 01:24 PM IST|Updated: Oct 13, 2025, 01:24 PM IST

Alekhya Chitti Pickles Fame Ramya Moksha: బిగ్‌బాస్ 9 వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.. అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష. ఇక ఇన్‌స్టాలో ఈ అమ్మడుకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే బిగ్‌బాస్‌కి వెళ్లిన రమ్య మోక్ష.. తనకు లైఫ్‌లో ఎదురైనా బాధాకరమైన సంఘటనలను ప్రేక్షకులతో పంచుకుంది. సోషల్ మీడియాలో మాపై వచ్చిన ట్రోల్స్‌కి.. లైఫ్ అంతా కొలాప్స్ అయిందంటూ ఎమోషనల్ అయింది. 
 

Alekhya Chitti Pickles Fame Ramya Moksha1/5

రమ్య మోక్ష కంచర్ల

రమ్య మోక్ష కంచర్ల అంటే చాలా మందికి తెలియక పోవచ్చు కానీ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ పచ్చళ్ల పాప గురించి సోషల్ మీడియాలో ఉండే వారందరికీ బాగా తెలుసు. ట్రెండింగ్ రీల్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక ఆ ఫేమ్‌తోనే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.   

Alekhya Chitti Pickles Fame Ramya Moksha2/5

రమ్య మోక్ష బిగ్‌బాస్

రమ్య మోక్షను బిగ్‌బాస్ స్టేజ్ మీద చూసి చాలా మంది షాకయ్యారనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. దానికి కారణం ఈ మధ్య రమ్య, ఆమె సిస్టర్ అలేఖ్య తీవ్రంగా ట్రోల్ అవడమే. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన రమ్య మోక్ష.. తనకు ఎదురైన బాధాకరమైన సంఘటనలను ఆడియన్స్‌తో పంచుకుంది.  

Alekhya Chitti Pickles Fame Ramya Moksha3/5

బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ రమ్య మోక్ష కంచర్ల

ఈ విషయం గురించి రమ్య మాట్లాడుతూ.. నేను ఫిట్‌నెస్ వీడియోలతో ఫేమస్ అయ్యాను. ఆ ఫేమ్‌తోనే పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాము. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఆ టైమ్‌లోనే నాకు ఒక సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. షూటింగ్ కోసం కొడైకెనాల్ వెళ్లిన నేను.. తిరిగి వచ్చేసరికి నాన్న చనిపోయారు. ఆయన చివరి చూపు కోసం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని రమ్య ఎమోషనల్ అయింది.   

Bigg Boss Wild Card Contestant Ramya Moksha4/5

అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష

ఇక ఆ సంఘటన జరిగిన రెండు వారాలకే పికిల్స్ బిజినెస్‌కి సంబంధించిన ఓ ఆడియో లీక్ అయింది. దీంతో సోషల్ మీడియాలో మమ్మల్ని చాలా ట్రోల్స్ చేశారు. విపరీతంగా తిట్టారు. దాంతో మా బిజినెస్ క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చిందని తెలిపింది.   

Bigg Boss Wild Card Contestant Ramya Moksha5/5

బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన రమ్య మోక్ష

నిజానికి మేము చేసింది తప్పే.. ఇప్పుడిప్పుడే దాని నుండి బయటకు వస్తున్నాం. అందుకే కెరీర్ మీద ఫోకస్ చేద్దామని బిగ్‌బాస్‌కి వచ్చాను. ఇక్కడ గెలిచి నేనంటే ఏంటో చూపిస్తానంటూ చెప్పుకొచ్చింది రమ్య మోక్ష. ప్రస్తుతం రమ్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.