Diya Mirza: సీఎం రేవంత్ చెప్పేవి పచ్చి అబద్దాలు..!.. ఎక్స్‌వేదికగా చివాట్లు పెట్టిన బాలీవుడ్ నటి.. మ్యాటర్ ఏంటంటే..?

Hcu Kancha Gachibowli issue: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ వివాదం ప్రస్తుతం తెలంగాణలో హట్ టాపిక్ గా మారింది. తాజాగా, దీనిపై బాలీవుడ్ నటి దియా మీర్జా ఏకంగా సీఎం రేవంత్ కు చివాట్లు పెట్టింది. ఈ అంశం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. రేవంత్ చేస్తున్న ఏఐ వాదనల్లో నిజంలేదని నటి కొట్టిపారేసింది.
 

1 /5

తెలంగాణలోని హెచ్‌సీయూ వివాదం ప్రస్తుతం సమ్మర్ లో మరింత హీట్ ను పెంచుతుంది.ఈ ఘటనను అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారిస్తుంది. తాజాగా.. తెలంగాణ హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు విన్పించింది. కొంత మంది కావాలని ఏఐ ఫోటోస్ లు, వీడియోలను  వైరల్ చేశారని కోర్టుకు తెలిపింది.  

2 /5

దీనిపై వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని చెబుతూ.. కేసును ఏప్రిల్ 24న వాదనలు వింటామని కోర్టు కేసును వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. రేవంత్ సర్కారు..  హెచ్‌సీయూ వివాదం ఉన్న 400 ఎకరాల భూముల్లో అసలు జింకలు, మరే జంతుజాలాలు లేవని రేవంత్ సర్కారు ఇటీవల వ్యాఖ్యలు చేశారు. కేవలం కొన్ని గుంటనక్కలు ఉన్నాయిన అన్నారు.  

3 /5

ఈ క్రమంలో రేవంత్ ప్రభుత్వం చేస్తున్న  ఏఐ వీడియోలు, ఫోటోల అంశంపై తాజాగా.. బాలీవుడ్ నటి దియా మీర్జా ఫైర్ అయ్యారు.  అసలు ఆ 400 ఎకరాల్లో ఎలాంటి జంతుజాలాలు లేవని సీఎం రేవంత్ ప్రభుత్వం వ్యాఖ్యలుచేయడం పచ్చి అబద్దమన్నారు. తాను.. ఎలాంటి ఏఐ వీడియోలు కానీ,ఫోటోలు కానీ షేర్ చేయలేదన్నారు.  

4 /5

 హెచ్‌సీయూ వివాదంపై పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే పోస్టులు పెట్టానన్నారు.. కళ్ల ముందు జింకలు, నెమళ్లు జనాల్లోకి వస్తున్నాయని.. ఇదంతా చూస్తు కూడా ఏఐ ఫెక్ అని అనడం ఎంతవరకు సమంజసం అని రేవంత్ ప్రభుత్వానికి బాలీవుడ్ నటి దియా మీర్జా చివాట్లు పెట్టింది. ఇప్పటికైన.. ప్రకృతిని రక్షించండి, జీవవైవిధ్యాన్ని కాపాడుకొవాలని కూడా కోరారు.  

5 /5

ఇదిలా ఉండగా.. హెచ్‌సీయూ వివాదంపై ప్రస్తుతం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, సినిమా ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రీటీలుకూడా రేవంత్ సర్కారు చేస్తున్న పనుల్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో హెచ్‌సీయూ వివాదం ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.