Bollywood Actress Vidya Balan: బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ గురించి సినిమా ప్రియులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిందీ సినిమాల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి.. ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. తాజాగా విద్యాబాలన్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
1/6నటి విద్యాబాలన్ ఇష్కియా, ది డర్టీ పిక్చర్, కహానీ లాంటి సూపర్ హిట్ సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఆమె నటనకు వివిధ పాత్రల్లో ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చాయి.
2/6ముంబైలో స్థిరపడిన తమిళ కుటుంబంలో విద్యా బాలన్ జన్మించింది. చిన్నప్పటి నుంచి నటి కావాలని కలలు కన్న ఆమె.. షబానా అజ్మీ, మాధురీ దీక్షిత్ లాంటి నటీమణుల నుంచి ప్రేరణ పొందింది. 16 ఏళ్ల వయసులో ఏక్తా కపూర్ యొక్క హమ్ పాంచ్ టీవీ షోలో రాధిక పాత్రతో.. విద్యాబాలన్ తొలి అడుగు వేసింది.
3/6ఆ తర్వాత పరిణీతి సినిమాతో హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ది డర్టీ పిక్చర్ సినిమా విద్యా బాలన్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ చిత్రంలో ఆమె నటనకు జాతీయ అవార్డు కూడా లభించింది. కహానీ, శకుంతల, బేగం జాన్ లాంటి లేడీ ఓరియేంటెడ్ సినిమాల్లో విద్యా బాలన్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.
4/6ది డర్టీ పిక్చర్ సినిమా కోసం విద్యా బాలన్ సిగరెట్ తాగే అలవాటు మొదలుపెట్టింది. ఆ తర్వాత అది ఆమెకు వ్యసనంగా మారింది. రోజుకు రెండు లేదా మూడు సిగరెట్లు తాగితేనే సంతృప్తిగా ఉండేదని విద్యా బాలన్ చెప్పింది.
5/6అయితే కొన్ని రోజులకు ఆ వ్యసనం నుండి పూర్తిగా బయటపడ్డానని.. ఇప్పుడు తాను సిగరెట్ తాగడం పూర్తిగా మానేసినట్లు విద్యా బాలన్ తెలిపింది. కాలేజీ రోజుల్లో బస్టాప్‌లో కూర్చుని ఉంటే ఎవరైనా సిగరెట్ తాగుతుంటే.. తాను ఆ పొగను ఆస్వాదించేదాన్నని విద్యాబాలన్ చెప్పింది.
6/6ఇక విద్యాబాలన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను వివాహం చేసుకుంది. తన విజయం వెనుక తన భర్త సిద్ధార్థ్ ఎప్పుడూ ఉన్నాడని విద్యాబాలన్ తరచుగా చెబుతూ ఉంటుంది. ఆమె నటన, పాత్రల ఎంపిక, వ్యక్తిగత జీవితం ఆమెను సినీ ప్రియులకు ఎప్పటికీ గుర్తుండిపోయే నటిగా చేశాయి.