Add Zee Business As A Preferred Source
App

Star Hero: ఏంటి ఇది నిజమా.. ఈ స్టార్ హీరోకి అసలు సోషల్ మీడియా అకౌంట్స్ లేవా..?

Written ByAruna Maharaju
Published: Sep 09, 2025, 03:20 PM IST|Updated: Sep 09, 2025, 03:23 PM IST

Bollywood Hero: ప్రస్తుతం ప్రపంచం అంతా సోషల్ మీడియా యుగంలో ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటారు. ఇక సినిమా యాక్టర్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారానే బయట పెడుతూ ఉంటారు. అయితే ఓ స్టార్ హీరో మాత్రం ఏ పబ్లిక్ ప్లాట్ ఫామ్స్‌లో లేకుండా అందరికీ పూర్తి అపోజిట్‌గా ఉన్నాడు. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Ranbir Kapoor  1/5

రణబీర్ కపూర్

బాలీవుడ్ చాక్లెట్ బాయ్, అమ్మాయిల కలల రాకుమారుడు రణబీర్ కపూర్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు ఈ స్టార్ హీరో. అయితే సినీ స్టార్స్ తమ వ్యక్తిగత జీవితం, సినిమా విశేషాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియా ద్వారా తమ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు.  కానీ రణబీర్ మాత్రం సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటాడు.

Ranbir Kapoor Is Not On Social Media2/5

రణబీర్ కపూర్‌

రణబీర్ కపూర్‌కు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి ఏ ఒక్క అకౌంట్ కూడా లేదు. సరైనా రీజన్ ఏంటో తెలీదు కానీ.. ఆయన సోషల్ మీడియాకు ఎప్పుడూ దూరంగానే ఉంటారు. రణబీర్ భార్య, స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మాత్రం అప్పుడప్పుడు రణబీర్‌తో కలిసి ఉన్న పిక్స్‌ని షేర్ చేస్తూ ఉంటుంది.

 

Ranbir Kapoor  3/5

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్ సినిమాల గురించి వివరాలు ప్రొడక్షన్ సంస్థలు లేదా అభిమానులు పంచుకుంటారు. కానీ రణబీర్ నుంచి ఎటువంటి అప్‌డేట్‌ రాదు.

 

Ranbir Kapoor Is Not On Social Media4/5

రణబీర్ కపూర్

ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది సినీ ఇండస్ట్రీకి చాలా పెద్ద ప్రమోషనల్ ఫ్యాక్టర్‌గా మారిపోయినప్పటికీ.. రణబీర్ కపూర్ మాత్రం దానికి దూరంగా ఉండటం నిజంగా ప్రత్యేక విషయం.

 

Ranbir Kapoor Is Not On Social Media5/5

రణబీర్ కపూర్

ఇక రణబీర్ కపూర్ ప్రస్తుతం రామాయణం సినిమాలో నటిస్తున్నాడు. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో, కన్నడ నటుడు యష్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.