Actress Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. తన సినిమాలతో ఎంతో మంది ఫేవరేట్‌గా మారిపోయింది. అయితే తాజాగా ఆలియా భట్.. తన కూతురి కోసం ఒక ఇంపార్టెంట్ డెషిషన్ తీసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1/5పాన్ ఇండియా సినిమా రంగంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఆలియా భట్ తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. సినిమా కెరియర్ పీక్‌లో ఉన్న టైమ్‌లోనే రణ్‌బీర్ కపూర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆలియా.. రాహా అనే పాపకు జన్మనిచ్చింది.
2/5ప్రస్తుతం ఆలియా భట్ తన ఫ్యామిలీతో సంతోషకరమైన జీవితం గడుపుతోంది. అయితే ఇటీవల ఆలియా.. తన కూతురు రాహా కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాహా ఎంజాయ్ చేసే సినిమాలు నేను చేయలేదు. ఇకపై తన కూతురు రాహా నవ్వుకునే కామెడీ సినిమాలు చేస్తానని ఆలియా తెలిపింది.
3/5ఇప్పటికే కొన్ని కొత్త ప్రాజెక్ట్‌లకు సైన్ చేసిన ఆలియా.. త్వరలో వాటి గురించి పూర్తి డీటెయిల్స్ చెబుతానని చెప్పింది. దర్శకుడు మహేష్ భట్ కూతురిగా సినిమా రంగంలోకి వచ్చిన ఆలియా భట్.. కరణ్ జోహార్ తీసిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
4/5సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది ఆలియా భట్. తన ఫొటోషూట్లతో ఎప్పుడూ అభిమానులను అలరిస్తుంటుంది. మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఆలియా భట్.. అనేక అవార్డులు కూడా గెలుచుకుంది.
5/5నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆలియా.. ఇప్పుడు బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరు. ఆలియా భట్ ఆస్తులు సుమారు 4,600 కోట్లకు పైగా ఉన్నాయని సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది ఈ బ్యూటీ.