Lookout Notice: బాలీవుడ్ స్టార్ కపుల్ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుస్తోంది. కోట్ల రూపాయల మోసం ఆరోపణలతో ఇటీవల వీరిపై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో వారిపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వ్యాపారం కోసం తీసుకున్న డబ్బును పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై.. ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తును ముమ్మరం చేసింది.
1/5బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శిల్పా శెట్టి తెలుగు సినిమాల్లో కూడా నటించి అందరి మనసు గెలిచింది. వెంకటేష్ తో కలిసి నటించిన సాహస వీరుడు సాగర కన్య సినిమాతో ఆమె పెద్ద విజయం సాధించింది. మంగళూరు నుంచి వచ్చిన శిల్పా శెట్టి.. బాలీవుడ్‌లో స్థిరపడి ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది.
2/5సినిమాలతో పాటు వ్యాపారంలో కూడా బిజీగా ఉన్న శిల్పా శెట్టి.. జీవితంలో ఊహించని సమస్యలు తలెత్తాయి. ఆమె భర్త రాజ్ కుంద్రా గతంలో అశ్లీల కేసులో ఇరుక్కొని జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇప్పుడు మరో కేసులో ఈ జంట ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
3/5బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే తమ సంస్థ విస్తరణ పేరుతో.. శిల్పా శెట్టి దంపతులు తన వద్ద నుంచి సుమారు రూ.60 కోట్లు తీసుకున్నారని.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కొఠారి వీరిపై ఈ ఆరోపణలు చేశారు.
4/52015 నుంచి 2023 వరకు శిల్పాశెట్టి దంపతులు.. తనను మోసం చేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వ్యాపారాన్ని విస్తరించడానికి పెట్టుబడిగా ఇచ్చిన డబ్బును వీరు వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించారని దీపక్ ఆరోపించారు.
5/5ఈ కేసు విచారణలో ఉండగా శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు వీరికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ జంట తరచూ విదేశాలకు వెళ్తుండడంతో ఈ నోటీసులు ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు.