Poonam Dhillon: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

Poonam Dhillon: పూనమ్ ధిల్లాన్ బాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన గ్లామర్ తార. పూనమ్  16 యేళ్ల చిరు ప్రాయంలోనే  మిస్ యంగ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. అంతేకాదు  ఫెమినా మిస్ ఇండియాగా నిలిచింది. అందాల పోటీలతో వచ్చిన ఇమేజ్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా కెరీర్ పరంగా దూసుకుపోయింది.

1 /7

Poonam Dhillon: అందాల పోటీల్లో గెలిచిన పూనమ్ ధిల్లాన్.. అమితాబ్ బచ్చన్ హీరోగా యశ్ చోప్రా తెరకెక్కించిన  'త్రిశూల్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నటిగా వెనుదిరిగి చూసుకోలేదు. మోస్ట్ సక్సెస్ ఫుల్ నటిగా  దాదాపు  80కి పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాదు మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకున్నాయి.

2 /7

సినిమాల్లో విజయవంతమైన నటిగా పేరు  తెచ్చుకన్న  పూనమ్ ధిల్లాన్  పర్సనల్ లైఫ్ లో పలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.  కేవలం 16 యేళ్ల  వయసులో 'మిస్ యంగ్ ఇండియా' అందాల కిరీటం  గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె రాత్రికి రాత్రే 'ఫెమినా మిస్ ఇండియా' టైటిల్ గెలుచుకోవడం ద్వారా ఒక్కసారిగా ఈమె క్రేజ్ పెరిగిపోయింది.

3 /7

యశ్ చోప్రా దర్శకత్వంలో అమితాబ్ హీరోగా నటించిన  'త్రిశూల్' చిత్రంతో ఆయన తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఈ సినిమా విజయం తర్వాత పూనమ్ వెనుదిరిగి చూసుకోలేదు. ఇక ఫస్ట్ మూవీ సక్సెస్ తర్వాత పూనామ్ 'నూరి' సినిమాకి సంతకం చేసింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు, దర్శకుడు రమేష్ తల్వార్ తో ప్రేమలో పడింది.  క్రమంగా, వారి ప్రేమ గురించి సినీ ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేశాయి.  ఇది మాత్రమే కాదు, ఇద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. సినిమా ఆఫర్స్ తగ్గిపోతాయే భయంతో  పూనమ్ తో పాటు రమేశ్  వాటన్నంటినీ ఖండించారు.

4 /7

అప్పట్లో ముంబైలోని ధనవంతులకు నిలయమైన ప్రాంతమైన జుహులో పూనమ్ కోసం దర్శకుడు రమేష్ తల్వార్ ఒక విలాసవంతమైన బంగ్లాను కూడా కొనుగోలు చేశాడు. ఈ విషయం గురించ అప్పటి వార్తాపత్రికలలో చాలా కథనాలు వచ్చాయి కూడా.  ఆ తర్వాత ఏమైందో ఏమో రమేష్ తల్వాల్ తో సంబంధానికి పూనమ  బ్రేకప్ చెప్పింది.

5 /7

1980లలో తన కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు పూనమ్ అప్పటికే పెళ్లైన దర్శకుడు రాజ్ సిప్పీతో ప్రేమలో పడ్డట్టు వార్తలు వచ్చాయి.అప్పట్లో ఈ జంట సంబంధం గురించి మొత్తం చిత్ర పరిశ్రమలో అందరు చెవులు కొరుక్కున్నారు. పూనమ్, రాజ్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ రాజ్ తన కుటుంబాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. దీంతో ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 

6 /7

చివరికి, 1988లో, పూనమ్ థిల్లాన్ ప్రముఖ నిర్మాత అశోక్ థాకరేను వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.వివాహం తర్వాత నటనకు కాస్త గ్యాప్ ఇచ్చింది. పెళ్లైన  కొన్నేళ్ల  తర్వాత, పూనమ్,  అశోక్ వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తాయి. 1994లో అశోక్.. వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆ సమయంలో పూనమ్ కూడా దీని గురించి బహిరంగంగా వేదికలపై భర్త తీరును ఎండగట్టింది. ఇక తన భర్తపై ప్రతీకారం తీర్చుకోవడానికి, అతనికి గుణపాఠం నేర్పడానికి పూనమ్ చివరకు హాంకాంగ్ వ్యాపారవేత్త కికుతో డేటింగ్ ప్రారంభించిందని చెబుతారు.

7 /7

ఇక నటి పూనమ్‌ను కలవడానికి కికు తరచుగా భారతదేశానికి వచ్చేవాడనేది సమాచారం. కొన్నిసార్లు పూనమ్ కికురాన్‌ను కలవడానికి హాంకాంగ్‌కు కూడా వెళ్లేది. అలా భర్తతో ఎప్పుడు  తగాదాలు, అపనమ్మకంతో పాటు తనను  మోసం చేసాడనే కసిత  పూనమ్, అశోక్ వివాహ జీవితంలో పెద్ద అగాధం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ 1997 లో విడిపోయారు.