Sridevi Boney Kapoor
శ్రీదేవి మన దగ్గర లేకుండా పోయి.. ఎన్నో రోజులు అవుతున్న కానీ.. ఆమె సినిమాలు.. ఆమెపై అభిమానం మాత్రం ఇంకా మన మదిలో అలానే ఉండిపోయాయి. ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అతిలోకసుందరిగా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్.. తన కెరియర్ చివరిలో మాత్రం ఎక్కువగా హిందీ సినిమాలు చేసింది..
1/5కెరియర్ మొదట్లో ఎన్నో తెలుగు సినిమాలలో నటించి.. తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్న.. శ్రీదేవి.. కెరియర్ చివరిలో మాత్రం ఎక్కువగా హిందీ సినిమాలు చేస్తూ కనిపించింది .
2/5ముఖ్యంగా ఆమె నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్, మమ్ చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇక మామ్ సినిమాకి శ్రీదేవి భర్త బోని కపూర్ నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసింది.
3/5ఈ సినిమా గురించి చెబుతూ.. బోని కపూర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆ సినిమా చేసేటప్పుడు ఏఆర్ రెహమాన్ కి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని. అయితే వాళ్ళు ముందుగా శ్రీదేవికి రేమ్యునరేషన్ కోసం కొంచెం డబ్బులు పక్కన పెట్టుకోగా…తనకు ఆ తప్పులు వద్దు ఆ 70 లక్షల కూడా ఏఆర్ రెహమాన్ కి ఇచ్చి అతని మ్యూజిక్ కి తీసుకోరమ్మన్నారు అని చెప్పుకొచ్చారు.
4/5అంతేకాకుండా ఆ సినిమా షూటింగ్ జరిగే సమయంలో.. శ్రీదేవిని తన గదిలో ఉండమంటే.. తన గదిలో ఉండకుండా వేరే గదిలో ఉండిందని బోనీకపూర్ చెప్పారు. శ్రీదేవి నటించేటప్పుడు డెడికేషన్ అలా ఉండేది అంటూ చెప్పుకొచ్చారు.
5/5ఇక ప్రస్తుతం బోనీకపూర్ శ్రీదేవి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.