Brahmamudi: ఎవరీ నందగోపాల్‌? రోడ్డున పడ్డ రాజ్‌.. ఏటీఎం మెషీన్‌లా మారిన కావ్య..

Sat, 14 Dec 2024-9:55 am,

మరోవైపు ఆఫీసులో రాజ్‌ హడావుడి చేస్తుంటాడు. అప్పుడే ఇద్దరు బ్యాంక్‌ అధికారులు ఆఫీస్‌లోకి దూసుకు వస్తారు. రాజ్‌ చెప్పకుండా వస్తారు అని మండిపడతాడు. మీ తాతయ్య కోసం వచ్చాను ఆయన రూ.100 కోట్లు ష్యూరిటీ వాళ్ల ఫ్రెండ్ కోసం పెట్టారు అంటారు. ఆయన చనిపోయారు సడెన్‌గా వారి కంపెనీ బోర్డు తిప్పేసింది. ఎంతో మంది రోడ్డున పడ్డారు. వారి తరఫున ష్యూరిటీ ఇచ్చిన మీ తాతయ్యే ఆ డబ్బులు కట్టాలి. లేదా వెంటనే మీ ఆస్తిని జప్తు చేయమంటారా? అంటారు. ఒక్కసారిగా షాక్‌ అవుతాడు రాజ్‌.  

అదేం చిన్న అమౌంట్‌ కాదు, వంద కోట్లు ఎలా ఒక్కసారి కడతారు. సారీ కుదరదు. సైన్‌ చేయండి. పదిరోజుల సమయం ఇస్తారు.. లేదంటే మీ ఇల్లు, ఆస్తి మొత్తం జప్తు చేస్తారు అంటారు. మీరే ఆలోచించుకోండి. వెంటనే రాజ్‌  సైన్‌ చేయబోతుంటాడు..పీఎ పక్కకు పిలిచి సలహా ఇస్తాడు. ఆస్తి మొత్తం కావ్యపై ఉంది కదా అంటాడు. మనకు సంబంధం లేదు అని చెబుదాం అంటాడు రాజ్‌. అలా చేస్తే మా తాతయ్య పరువు పోతుంది అలా జరగకూడదు అని వెళ్లి సైన్‌ చేసేస్తాడు రాజ్‌.  

మీకు పదిరోజులు సమయం ఇస్తున్నాం.. ఈలోపు మీరు బ్యాంకుకు కట్టాల్సిన డబ్బులు చెల్లించండి అని చెప్పి వెళ్లిపోతారు బ్యాంకు అధికారులు. ఇప్పుడు వంద కోట్లు ఎలా కట్టాలి? ఎక్కడి నుంచి తేవాలి? అని రాజ్‌ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఇంట్లో హాల్‌లో ఉన్న రాజ్‌ నాన్నను రుద్రాణీ రూ.2 లక్షలు కావాలని అడుగుతుంది. ఇప్పుడు ఇంటి బాధ్యతలు అన్ని నాన్న కావ్య చేతికి ఇచ్చాం అంటారు. వెళ్లి కావ్యను అడుగు అంటాడు జగదీష్‌. నేను కాళ్లు పట్టుకోవాలా? అంటుంది. వెళ్లు అడిగితే ఇస్తుంది కదా..  

అప్పుడే మామ్‌ నువ్వు ఆవేశపడు నేను మాట్లాడతా మావయ్య అంటాడు రాహుల్‌. కావ్య కారణాలు అడగదు. ఒక వేళ అడిగితే నీకెందుకు చెప్పాలి అని బెదిరించు అంటాడు రాహుల్‌. నీ బుర్ర ఎలా పనిచేస్తుంది రా.. చూస్తుండు ఇక నుంచి ఆ కావ్యను ఏటీఎం మెషీన్‌లా ఎలా వాడతానో అని వెళ్తుంది రుద్రాణీ. గార్డెన్‌లో చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటుంది కావ్య.. ఏయ్‌.. అని పిలిస్తే పలకవా వెతకారామా? అంటుంది రుద్రాణీ. ఎందుకు పిలిచారో చెప్పండి అంటుంది కావ్య. నాకు రెండు లక్షలు కావాలి అంటుంది. ఈవిడకు అంత డబ్బు ఇచ్చి నేను ఏం సమాధానం చెప్పాలి. లేవని చెప్పలేను. ఇవ్వలేను అని మనుసులో అనుకుంటుంది కావ్య.  

అంత డబ్బు ఎందుకు అంటుంది కావ్య. అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది ధాన్యం. ప్రతీది నీకు చెప్పి చేయాలా? అంటుంది. అందరి మీద అజమాయిషీ చెలాయించకు అంటుంది. మేము డబ్బులు అడిగితే ఎందుకు అని తిరిగి అడిగితే మమ్మల్ని అవమానించినట్లే. మహారాణిలా ఫీలవ్వమని మీ పేరున రాయలేదు. ఎందుకు ఖర్చు పెడుతున్నారో చెబితే నేను రాసుకుంటాను. నేను సమాధానం చెప్పాలి కదా.. అడిగితే మేం సమాధానం చెబుతాం. డబ్బు తీసుకు రావడానికి వెళ్తుంది కావ్య. ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో నీకు బాగా తెలుసు అని రుద్రాణీ ధాన్యాన్ని అంటుంది

రుద్రాణీ నువ్వు కూడా కావ్యతో కరా ఖండిగా ఉండు లేదంటే నెత్తిన ఎక్కి కూర్చొంటుంది అంటుంది ధాన్యం. డబ్బు తెచ్చి ఇస్తుంది కావ్య.. ఇక నుంచి ఎంత అడిగితే అంత నోరు మూసుకుని అడగాకుడా ఇవ్వు అని డబ్బు తీసుకుని వెళ్తుంది రుద్రాణీ. మరోవైపు రాజ్‌ ఆఫీసులో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే శృతి వస్తుంది. ఈ ఫైల్స్‌ మీద సంతకం పెట్టాలి అంటుంది. శృతిపై విరుచుకు పడతాడు.   

అర్జెంట్‌గా సైన్‌ చేయపోతే నాకు వంద కోట్లు లాస్‌ రాదే అని ఫైల్ పక్కకు నెట్టేస్తాడు రాజ్‌. చిరాకుగా ఉంటాడు. తాత చెప్పిన మాటలు అతని మనసులో మెదులుతూ ఉంటాయి. ఎన్నో పరీక్షలు ఎదురు అవుతాయి కృంగి పోకూడదు సమస్య పరిష్కరించాలి అని తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. పదిరోజుల్లో డబ్బు కట్టకుంటే ఆస్తులు జప్తు అవుతాయి. ఎక్కడినుంచి వంద కోట్లు తేవాలని రాజ్‌ రోడ్డుపై నడుస్తుంటాడు. వెనకాలా డ్రైవర్‌ కూడా పిలుస్తూ ఉంటాడు.  

మరోవైపు ధాన్యం కూడా రూ.3 లక్షలు కావాలని వేధిస్తుంది. పోలీసులకు ఫోన్‌ చేసి ఫాలో అవుతున్న అంటాడు. నందగోపాల్‌ ఫారిన్‌ వెళ్లిపోయాడు అన్ని సెక్యూరిటీ చెబుతాడు. మరుసటి ఎపిసోడ్‌ లో ఇదంతా జరిగినట్లు చూపిస్తారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link