Add Zee Business As A Preferred Source
App

Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌కి తాళం.. కంటెస్టెంట్లు బయటికి.. మేకర్స్ కోర్టుకి.. అసలేం జరిగిందంటే..!

Written ByAruna Maharaju
Published: Oct 08, 2025, 11:12 AM IST|Updated: Oct 08, 2025, 04:07 PM IST

Bigg Boss Reality Show House Seize: ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్‌కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీలో బిగ్‌బాస్ రియాల్టీ షో.. మంచి టీఆర్‌పీతో దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు కన్నడ బిగ్‌బాస్ అభిమానులకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు షాక్ ఇచ్చారు. హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ కన్నడ 12వ సీజన్‌  విజయవంతంగా దూసుకెళ్తోంది. 
 

Bigg Boss House Officials Seize1/5

కన్నడ బిగ్ బాస్ షో నిలిపివేత

కన్నడ బిగ్ బాస్ షో హౌస్‌ను పర్యావరణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు సీజ్ చేశారు. హౌస్ నిర్వహణకు అవసరమైన అనుమతులు లేకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ బిగ్‌బాస్ సీజన్ 12 నిర్వాహకులు ఆ నోటీసులకు స్పందించలేదు.   

Bigg Boss House  2/5

కన్నడ బిగ్ బాస్ షో నిలిపివేత

దీంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు హౌస్‌ను పూర్తిగా సీజ్ చేసి, కంటెస్టెంట్లను థియేటర్‌కు తరలించారు. హౌస్‌లో మురుగునీటిని శుద్ధి చేయకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వదిలేస్తున్నారని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని అధికారులు గుర్తించారు.   

Bigg Boss House Seize3/5

బిగ్‌బాస్ హౌస్ సీజ్

అంతేకాకుండా రెండు పెద్ద డీజిల్ జెనరేటర్లు 24 గంటల పాటు పని చేస్తూ కాలుష్యాన్ని విపరీతంగా పెంచుతున్నాయని పొల్యూషన్ బోర్టు అధికారులు తెలిపారు. 

Bigg Boss House Officials Seize4/5

బిగ్‌బాస్ హౌస్ సీజ్

పర్యావరణ అనుమతులు లేకపోవడంతో రెండుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు. ఇప్పుడు ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందో, బిగ్ బాస్ షో మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.  

Bigg Boss House Officials Seize5/5

బిగ్‌బాస్ హౌస్ సీజ్

హీరో కిచ్చా సుదీప్‌ హోస్ట్‌గా.. బిగ్‌బాస్‌ కన్నడ సీజన్ 12 సెప్టెంబర్‌ 28న ప్రారంభం కాగా.. ఇప్పుడు షోను సీజ్ చేయడంతో సోషల్‌ మీడియాలో ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది.