India Vs Brunei Currency: బ్రూనై ప్రపంచంలోనే అత్యంత చిన్న ముస్లిం దేశం. ఈ దేశం అత్యంత ఖరీదైన కరెన్సీని ముద్రిస్తుంది. దీని 10,000 బ్రూనై డాలర్ నోటు భారతదేశంలో దాదాపు రూ. 6.80లక్షలకు సమానంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశం కరెన్సీ విలువ ఎందుకంత విలువైంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/5ప్రపంచ దేశాల కరెన్సీలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అమెరికా డాలర్ లేదంటే యూరో గురించి. కానీ భారతదేశంలో ఒక నోటు ధర సుమారు రూ. 7లక్షల వరకు ఉంటుందని మీకు తెలుసా. ఈ నోటు బ్రూనై దేశానిది. ఈ దేశంలోని ఒక కరెన్సీ రూ. 10,000 బ్రూనై డాలర్ నోటు దీని విలువ భారత దేశంలో సుమారు రూ. 6.80లక్షల వరకు ఉంటుంది. ఇంత మొత్తంలో ఉంటుందా అని మీరు షాక్ అవుతారు. . Vice.com నివేదిక ప్రకారం, 1 బ్రూనై డాలర్ విలువ భారత రూపాయలలో రూ. 69.61గా ఉంది.
2/5బ్రూనై ఆగ్నేసియాలోని ఒక చిన్న దేశం. కానీ చాలా సంపన్న దేశం. ఆ దేశంలో విస్తారమైన చమురు, సహజ వాయులు నిల్వలు ఉన్నాయి. సుమారు 500, 000జనాభా ఉన్న ఈ దేశం ఆదాయం దాని పౌరుల జీవన ప్రమాణాలతో ప్రతిబింబిస్తుంది. అందుకే ఆ దేశ కరెన్సీని ప్రపంచం ఉదాహరణగా పరిగణిస్తుంది.
3/5బ్రూనై నోట్లు డినామినేషన్ ప్రపంచంలో ఇంత ఎక్కువ విలువ కలిగిన కొన్ని కరెన్సీల్లో ఒకటిగా నిలిచింది. 10,000 బ్రూనై డాలర్లను అమెరికా డాలర్లుగా మార్చితే దాదాపు 7, 770 యూఎస్డీ అవుతుంది. బ్రూనై ఈ నోట్లను లిమిట్ గా ముద్రిస్తుంది. ఇష్టం వచ్చినట్లుగా ముద్రించదు. వాటి భద్రత కూడా ఆ విధంగానే ఉంటుంది
4/5
బ్రూనై, సింగపూర్ 1967లో ఒక చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వాటి కరెన్సీలకు ఉమ్మడి విలువను ఏర్పాటు చేసుకున్నాయి. నేడు బ్రూనై డాలర్, సింగర్ పూర్ డాలర్ సమానంగా ఉన్నాయి. ఈ రెండు దేశాలు ఒకదానికొకటి కరెన్సీలను అంగీకరిస్తాయి. దీంతో బ్రూనై కరెన్సీకి మరింత విలువ పెరిగింది.
5/5ఇక ఈ దేశ ఆర్థిక బలం గురించి చెప్పుకుంటే చమురు, గ్యాస్ ఎగుమతుల నుంచి భారీగా ఆదాయం సమకూరుతుంది. దీంతో ఆ దేశ ప్రభుత్వం దగ్గర అపారమైన నగదు నిల్వలు ఉన్నాయి. అసలే అప్పు అనేది ఉండదు. జీడీపీలో కేవలం 1.9శాతం. తక్కువ జనాభా, సంమ్రుద్ధిగా ఉన్న వనరుల కారణంగా ఈ దేశ తలసరి ఆదాయం ఆసియాలో అత్యధికంగా ఉంది. అందుకే ఆ దేశ కరెన్సీ ప్రపంచంలోనే శక్తివంతమైన కరెన్సీల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు.