BSNL Cheapest Plan: చాలామంది టెలికం యూజర్లు అనుకునేది ఒక్కటే.. తక్కువ ధరకే లభించే రీఛార్జి చేసుకుని ఎక్కువ ప్రయోజనాలు పొందాలని... కానీ ఈ కాలంలో డేటా, కాలింగ్ కి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. రీఛార్జి ప్లాన్స్ చూస్తే కనీసం రూ. 300కు పైగా కచ్చితంగా ఖర్చు చేయాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దిగ్గజ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ తీసుకువచ్చింది. దీని రీచార్జ్ ప్లాన్ కేవలం రూ.485 మాత్రమే కానీ 72 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ప్రతిరోజు 2gb డేటా, అపరిమిత కాలింగ్ బెనిఫిట్స్ పొందుతారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
1/5BSNL Cheapest Plan: పెరిగిన టెలికాం ధరల తర్వాత అన్ని ప్రైవేట్ దిగ్గజ కంపెనీ టెలికాం ధరలో రీఛార్జి ప్లాన్స్ పెరిగిపోయాయి. ప్రభుత్వ దిగ్గజ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ కు చాలా మంది పోర్ట్ అయ్యారు. అయితే దీనికి అనుగుణంగానే ఈ ప్రభుత్వ దిగ్గజ కంపెనీ కూడా రీఛార్జి ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది.
2/5యూజర్లు పెద్దగా డబ్బు ఖర్చు పెట్టకుండానే సులభంగా ఇంటర్నెట్ డేటా.. అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతున్నారు. ఇప్పటికే 4జి సేవలు అందిస్తున్న బిఎస్ఎన్ఎల్ భవిష్యత్తులో 5జీ సేవలు కూడా అందించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
3/5ప్రధానంగా రెండో సిమ్ ఉపయోగించే వారికి బంపర్ బెనిఫిట్స్ అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఎక్కువ కాలం పాటు సిమ్ యాక్టివ్ గా ఉండాలంటే అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఈ రీఛార్జ్ ప్లాన్స్ ఉపయోగించటం వల్ల బెనిఫిట్స్ పొందుతారు. మీ బడ్జెట్ ఫ్రెండ్లీ లోనే ఈ రీఛార్జి ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి.
4/5ఈ రూ. 485 ప్లాన్ అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు 2gb హై స్పీడ్ ఇంటర్నెట్ డేటాతో అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు. దీని వాలిడిటీ 72 రోజులపాటు వస్తుంది. అయితే ఇంటర్నెట్ పూర్తయిపోయిన తర్వాత కూడా 40 కేబీపీఎస్ నెట్ మీకు అందిస్తుంది.
5/5ఇతర ప్రైవేట్ దిగ్గజ కంపెనీలు అయితే ప్రతిరోజు 2gb డేటా పొందాలంటే కచ్చితంగా 700 కు పైగా డబ్బులు ఖర్చు చేయాల్సిందే. అప్పుడే మీరు ఇంర్నెట్ డేటా వాలిడిటీ పొందుతారు. ప్రభుత్వ దిగ్గజ కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ ని ఉపయోగించడం వల్ల జేబుకు చిల్లు పడకుండా ఉంటుంది.