Add Zee Business As A Preferred Source
App

BSNL Discount: BSNL యూజర్లు ఎంజాయ్ పండగో.. రూ. 199 రీఛార్జ్ ప్లాన్‌పై అదిరిపోయే డిస్కౌంట్.. ఎంత సేవ్ అవుతుందంటే..!

Written ByAruna Maharaju
Published: Oct 26, 2025, 11:57 AM IST|Updated: Oct 26, 2025, 01:53 PM IST

BSNL Prepaid Offer: BSNL.. తన కస్టమర్లకి అదిరిపోయే బంపర్ న్యూస్ చెప్పింది. ఇప్పుడున్న రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. నిజానికి టెలికాం మార్కెట్‌లోని పోటీదారులతో పోల్చితే ఈ ప్లాన్ ఇప్పటికే చౌకైన రీఛార్జ్ ప్లాన్‌గా రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ BSNL ప్లాన్ అన్ని BSNL సర్కిల్‌లలోని కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ప్లాన్‌తో యూజర్లకు ఎంత సేవ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Bsnl 199 Prepaid Plan Discount1/5

బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

BSNL రూ.199 ప్లాన్‌తో రీఛార్జ్ చేయిస్తే రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు వస్తాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో యూజర్లకు అందుబాటులో ఉంది.   

Bsnl 199 Prepaid Plan Discount2/5

బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

ఇక్కడ మరో విషయం ఏంటంటే రూ. 200 కంటే తక్కువ ధరకు లభించే 28 రోజుల వ్యాలిడిటీతో  రోజుకు 2GB డేటాను అందించే మరే ఇతర ప్లాన్ పోటీ కంపెనీల నుంచి లేదు. తాజాగా BSNL కొత్త డిస్కౌంట్ ప్లాన్ గురించి ఎక్స్‌లో పోస్ట్ ద్వారా తెలిపింది.   

Bsnl 199 Prepaid Plan Discount3/5

బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

ఈ BSNL ప్లాన్ అన్ని BSNL సర్కిల్‌లలోని కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని.. ఆఫర్‌లో భాగంగా ఇది 2.5% తక్షణ తగ్గింపుతో వస్తుందని వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ కేవలం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 18, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంది, అలాగే చెల్లుబాటు అవుతుందని BSNL పేర్కొంది.   

Bsnl 199 Prepaid Plan Discount4/5

బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

కస్టమర్లకు రూ.199 రీఛార్జ్ పై 2.5% తగ్గింపు అంటే రూ. 4.97 ఆదా అవుతుంది. డిస్కౌంట్ పొందిన తర్వాత ఈ ప్లాన్ మీకు రూ.194.02 కు వస్తుంది. ఎక్స్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రకారం.. రూ.199 ప్లాన్‌పై డిస్కౌంట్ పొందడానికి యూజర్లు BSNL సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.   

Bsnl 199 Prepaid Plan Discount5/5

బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

అంటే థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగించి చేసే రీఛార్జ్‌లపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండదనే విషయాన్ని బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు తెలుసుకోవాలి.