BSNL Holi Dhamaka Offer: ప్రభుత్వ దిగ్గజ కంపెనీ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తక్కువ ధర రీఛార్జ్ ప్యాక్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో హోలీ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా ఆఫర్ కూడా ప్రకటించింది. ఇది 14 నెలల వ్యాలిడిటీ ప్లాన్. అతి తక్కువ ధరలోనే పొందుతారు ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇవే.
ప్రభుత్వ దిగ్గజ టెలికాం కంపెనీ అయినా బిఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 9 కోట్ల మొబైల్ యూజర్లకు ఇది తీపి కబురు అందించింది. ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేస్తున్న బీఎస్ఎన్ఎల్ తాజాగా ఎక్స్ వేదికగా హోలీ సందర్భంగా మరిన్ని ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
బీఎస్‌ఎన్‌ఎల్ ఈ కొత్త రీఛార్జి ప్లాన్లతో ప్రైవేట్ దిగ్గజ కంపెనీలకు సైతం చెక్ పెడుతుంది. కొత్త రీఛార్జ్ ప్లాన్లతో యూజర్లకు ఎక్కువ ఫీచర్లను అందిస్తుంది. దీంతో లాంగ్ టైం వాలిడిటీ కూడా పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం మంది బిఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ కూడా అయ్యారు
బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఈ హోలీ ధమాకా ఆఫర్ ప్లాన్‌లో మీరు అధనంగా 30 రోజులు పొందుతారు. దీని ప్లాన్ ద్వారా కేవలం రూ. 2399 మాత్రమే. గతంలో ఈ ప్లాన్ కేవలం 395 రోజులు మాత్రమే వర్తించేది కానీ హోలీ ధమాకా ఆఫర్లో భాగంగా 425 రోజులు ఈ ప్లాన్ మీరు వ్యాలిడిటీ పొందుతారు
బీఎస్ఎన్ఎల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ దేశవ్యాప్తంగా ఏ నెట్వర్క్ అయినా చేసుకునే సదుపాయం కల్పించింది. ఇది కాకుండా ఉచితంగా నేషనల్ రోమింగ్, కాంప్లిమెంటరీ కాలింగ్ ఢిల్లీ ముంబైలో ఉన్న ఎంటీఎన్‌ఎల్ యూజర్లు పొందుతారు. స్పీడ్ ఇంటర్నెట్ డేటా కూడా పొందుతారు.
ఇది కాకుండా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితం. మొత్తం మీరు 850 డేటా పొందుతారు. అదనంగా BItv సబ్‌స్క్రీప్షన్ మొబైల్ యూజర్లు పొందుతారు. ఇవి కాకుండా కాంప్లిమెంటరీగా కొన్ని ఓటీటీలు. దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మెరుగు చేసే దిశగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 4జీ టవర్లను లక్షకు పైగా ఏర్పాటు చేసింది.
అంతేకాదు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ఇప్పటికే 65 వేలకు పైగా 4g మొబైల్ టవర్స్ ఆపరేషన్‌లోకి వచ్చాయి. మిగతావన్నీ కొన్ని నెలల్లో పూర్తిచేసే అవకాశం ఉంది. దీంతో యూజర్లకు బెట్టర్ కనెక్టివిటీ కూడా పొందుతారు.