BSNL Freedom Sale: బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ వినియోగదారులకు బిగ్ గిఫ్ట్ అని చెప్పాలి. ఫ్రీడమ్ ప్లాన్ లో భాగంగా ఆగస్టు 15 కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన బిఎస్ఎన్ఎల్ రూ.1 సిమ్ కార్డ్ ప్లాన్ ను 15 రోజులు పొడగించారు. ఈ కేంద్ర ప్రభుత్వ టెలికాం కంపెనీ అంటే సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ రూ.1 అందుబాటులో ఉంటుంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
1/5మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు యూజర్లతో మీకు బంపర్ గుడ్ న్యూస్ మరో 15 రోజులపాటు కేవలం రూ.1 ఉచిత సిమ్ కార్డుతో పాటు 30 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్ రోజుకు 2gb హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. ఇది సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు ప్రకటించింది.
2/5ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం ఫ్రీడమ్ ప్లాన్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను పరిచయం చేసింది. దీనికి విశేష స్పందన రావడంతో మరో 15 రోజులు పొడిగిస్తున్నట్లు సమాచారం. నిన్నటితో గడువు ముగియగా ఈ నెల 15 వరకు పొడగించింది.
3/5కొత్త కస్టమర్లను ఆకట్టుకునే దిశగా బీఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం రూ.1 మీరు సిమ్ కార్డు కొనుగోలు చేస్తే 2gb డేటాతో పాటు ఉచిత ఎస్ఎంఎస్లు అపరిమిత వాయిస్ కాలింగ్ నేల పాటు పొందుతారు.
4/5ఈ ప్లాన్ తో రీఛార్జీ చేసుకోవాలంటే మై బిఎస్ఎన్ఎల్ యాప్ లేదా బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ లోకి లాగిన్ అయి అక్కడ మీరు ఫ్రీడమ్ ఆఫర్ ఎంపిక చేసుకొని రూ.1 మాత్రమే రీచార్జ్ చేసుకోవాలి. వెంటనే మీకు 2gb డేటా వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఇది వెంటనే యాక్టివేట్ అవుతుంది.
5/5ఈ బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ ఇప్పటికే ఉన్న కస్టమర్‌లకు కాదు కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది 4g సేవ అందిస్తుంది. కేవలం ఒక్క రూపాయి చెల్లింపుతో మీరు ల పాటు సేవలు పొందవచ్చు. ఇది సెప్టెంబర్ 15 చివరి తేదీ.