BSNL Yearly Plan: భారత సంచార నిగం లిమిటెడ్ (BSNL) వినియోగదారులకు అద్భుతమైన రీఛార్జ్ ప్లాక్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది. మీరు పోస్ట్ పెయిడ్ బిల్స్ కట్టలేక విసుగెత్తిపోతే మీకోసం ఏడాదిపాటు వ్యాలిడిటీ అందించే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ ధర కేవలం రూ.1515 మాత్రమే. అంటే నెలకు కేవలం రూ.126 మాత్రమే చెల్లిస్తే ఏడాది మొత్తం మీరు ఈ లాభం పొందుతారు..
బిఎస్ఎన్ఎల్ రూ. 1515 ప్లాన్.. ప్రభుత్వ దిగ్గజ కంపెనీ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఏడాది ప్లాన్ రూ. 1515 మాత్రమే. BSNL ఈ అద్భుతమైన ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మీరు 2GB డైలీ డేటా ఏడాది పాటు పొందుతారు. దీంతో వీడియోస్ స్ట్రీమింగ్ తో పాటు ఓటిటి కంటెంట్ కూడా వీక్షించవచ్చు
ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ దేశవ్యాప్తంగా చేసుకోవచ్చు. అంతే కాదు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా పొందుతారు.. డేటా లిమిట్ పూర్తయిపోయిన తర్వాత 40 కేబీపీఎస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందుతారు. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల పాటు ఎంజాయ్ చేసే ప్లాన్
బీఎస్ఎన్ఎల్ ప్లాన్లు ఎక్కువగా ఇంటర్నెట్ వాడేవారికి, తరచూ కాల్స్ చేసుకునే వారికి బంపర్ లాభాలను తీసుకువస్తుంది. అంటే ప్రతిరోజు కేవలం రూ.4.2 కే ఈ బెనిఫిట్స్ పొందవచ్చు .. అయితే ఇతర కంపెనీల మాదిరి ఇందులో కూడా ఓటీటీ సబ్స్క్రిప్షన్ మాత్రం అందుబాటులో లేదు.
బీఎస్ఎన్ఎల్ 365 రోజుల మరో అద్భుత ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ధర రూ. 1198. దీని వ్యాలిడిటీ కూడా ఏడాది పాటు ఉంటుంది.. అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా పొందుతారు. అయితే ఇందులో వినియోగదారులు 300 కాలింగ్ నిమిషాలు పొందుతారు. దీంతోపాటు ప్రతిరోజు 35 ఉచిత ఎస్ఎంఎస్ లో పాటు 3gb డేటా.
ఇది కేవలం ఇంటర్నెట్ అతిగా వినియోగించే వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ పెరిగిన టెలికాం ధరల తర్వాత బిఎస్ఎన్ఎల్ ధరలు పెంచకపోవడంతో చాలామంది ఎయిర్‌టెల్, జియో కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ పోర్ట్ అయ్యారు.
ఇక ఈ ప్రభుత్వ రంగ దిగ్గజ కంపెనీ కూడా 4g సేవలను విస్తృతం చేసింది. ఇప్పటికే లక్షకు పైగా టవర్లను ప్రధాన నగరాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. ఇకపై చేసేవాళ్లను కూడా అందించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తక్కువ ధరలోనే అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది వినియోగరులను ఆకట్టుకుంటుంది బిఎస్ఎన్ఎల్.